29.7 C
Hyderabad
May 1, 2024 07: 30 AM
Slider నల్గొండ

ఉక్రేయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్న అమెరికా చైనా

#Sheetala Roshapati

రష్యా,ఉక్రెన్ యుద్ధ పోరాటానికి ఏడాది పూర్తయినా ఐక్యరాజ్య సమితి మారణ హోమాన్ని అగ్ర రాజ్యాలు, ఐక్యరాజ్యసమితి,మేధావివర్గాలు ఆలోచించాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తన ఆందోళన వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో విలేకరులతో రోషపతి మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వేలాదిమంది ప్రజలు బలైనారని,వేలాది కోట్ల ఆస్తి నష్టం జరిగిందని,80 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ఇతర దేశాలకు వెళ్లి శరణార్థులుగా మారారని అన్నారు.7000 మందికి పైగా ఉక్రెన్ పౌరులు మరణించారని,ఇలాగే కొనసాగితే మరో ప్రపంచ యుద్ధం జరిగేలా ప్రమాదం ఉందని రోషపతి అన్నారు.

ప్రపంచ దేశాలైన అమెరికా,చైనా చీలి, యుద్ధానికి ఆద్యం పోస్తున్నారని,యుద్ధం పర్యవసానంగా ప్రపంచ దేశాలకి ఆర్థిక మాధ్యం ఏర్పడిందని అన్నారు.తాజాగా ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు జో బై డన్  ఉక్రెన్ రహస్య పర్యటనలో ఆజ్యం పోస్తున్నారని,బాగా యుద్ధం  చేస్తున్నారు మీకు కావాల్సిన ఆయుధాలు, ఆర్థికంగా సహకరిస్తూ గుడ్ అని చెప్పి యుద్ధానికి ఆద్యం పోస్తూ వారి ఆయుధాలు అమ్ముకోవడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.దీనిపై ఐక్యరాజ్యసమితి,ప్రపంచ మేధావులు చొరవ తీసుకొని మానవ ప్రాణాలు కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దుర్గారావు, కోటేశ్వరరావు,లాలయ్య,కోటమ్మ,రాకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి కృషి

Bhavani

కాగజ్ నగర్ లో ఘనంగా నందమూరి జయంతి

Satyam NEWS

చంద్రబాబు నుంచి డబ్బులు తీసుకుంటున్న కమ్యూనిస్టులు

Satyam NEWS

Leave a Comment