28.7 C
Hyderabad
April 28, 2024 09: 37 AM
Slider ఆదిలాబాద్

కాగజ్ నగర్ లో ఘనంగా నందమూరి జయంతి

#TDP Kagajnagar

విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ 97వ జయంతి కాగజ్ నగర్ లోని  ఎన్టీఆర్ చౌరస్తా లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ చేసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ ఇన్ చార్జి గుల్లపెళ్ళి ఆనంద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అన్నారని, ప్రజా స్వామ్యం అస్తవ్యస్థంగా వున్న సమయంలో పేదవారి కష్టాలు తీర్చాలని సిని పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతున్న అన్న ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.

కేవలం 9నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమం కోసం పటేల్, పట్వారీ వ్యవస్థను రూపు మాపారు. బిసి,ఎస్సి, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ను చైతన్య పరిచిన ఘనత తెలుగుదేశం పార్టీది. మహిళలకు 33 % రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని ఆనంద్ అన్నారు.

1985 లో ముఖ్యమంత్రి హోదాలో అన్నగారు గిరిజన జిల్లా ఐన  ఆదిలాబాద్ , ఖానాపూర్ నియోజకవర్గ పెంభి వచ్చిన సందర్భంలో 7వ తరగతి చదివి న గిరిజనులకు ఉపాధ్యాయులుగా నియమించి , వారికి శిక్షణ ఇచ్చి గిరిజనులను చైతన్యం చేశారని గుర్తు చేశారు.

అలాగే చెలిమేల వాగు ప్రాజెక్టు శంకుస్థాపన కోసం వచ్చిన సమయంలో తాండూర్ లో రాత్రి బస చేసి అక్కడి సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగం తో యువత అల్లాడుతుంటే ఆనాడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని పరుగు పందెం నిర్వహించి అందులో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు.

ఇలా ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో పేదవారి  గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహాను బావుడు అన్న ఎన్టీఆర్ అని ఆనంద్ అన్నారు. అనంతరం స్థానిక ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. తోపుడు బాండ్ల వారికి ,బస్టాండు లోని ప్రయాణికుల మస్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి గుల్లపెళ్లి లావణ్య, పార్లమెంట్ కమిటి అధికార ప్రతినిధి మీర్ సాధిక్ అలీ , కార్యనిర్వాహక కార్యదర్శి పరిచురి సురేష్ కుమార్, మోషీన్ బేగ్, ఎల్. మధుకర్, గులబ్ రావ్, దేవేందర్, చల్లురి శంకర్, సత్యం, మాకుబుల్, ఉసేన్, తహరే తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

Satyam NEWS

డిసెంబర్ లో సెట్స్ కి వెళ్తున్న “డ్యూడ్”

Satyam NEWS

కొవిడ్ మాస్క్ ల తయారీలో నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

Satyam NEWS

Leave a Comment