29.7 C
Hyderabad
April 29, 2024 09: 06 AM
Slider ప్రత్యేకం

ప్రభుత్వం అంటే ఉద్యోగులే: మంత్రి శ్రీనివాస్ గౌడ్

#ministersrinivasagowd

ప్రభుత్వం అంటే ఉద్యోగులేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టిజిఓస్ డెయిరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర గొప్పదన్నారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసుకుని ప్రజలకు అన్ని విధాలా పథకాలు అందిస్తున్నామని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిని వేగంగా చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఒక రాష్ట్ర సెక్రటేరియట్(జార్ఖండ్) కంటే తెలంగాణలోని కలెక్టర్ కార్యాలయాలు గొప్పగా ఉన్నాయన్నారు. టీఎన్జీవోస్, టిజిఓస్ అందరూ ఒక్కటేనన్నారు.

జిల్లాల పెంపు తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్లు పెరిగాయని తెలిపారు. ప్రజలకు నేరుగా సుపరిపాలన అందించాలి.. ప్రతి పథకం పేదలకు అందాలి.. అందరూ బాగుపడాలని కోరుకున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణను చూసి నేర్చుకోండి అనే రీతిలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగాలు ఉన్నా పోయినా పర్వాలేదని నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడామని, ఆంధ్ర ప్రజల మీద కాదన్నారు.

ఆంధ్ర ప్రజలు మనం అన్నదమ్ములమేనని పేర్కొన్నారు. ఇంత వేగంగా అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంపై కొందరి కన్ను పడిందని, ఈ రాష్ట్రం మాదిరిగా దేశం ఉండొద్దని అనుకుంటున్నారన్నారు. దేశం మొత్తం అంధకారంలో ఉండాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యక్ష కారకులైతే ఆయనకు వెన్నుదన్నుగా ఉద్యోగులు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి ఉద్యోగి కష్టపడి పని చేస్తున్నారు కాబట్టే ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారన్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులు తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండేలా పని చేయాలని సూచించారు. దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉంటుందని, ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండేలా సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజిగౌడ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, టిజిఓ జిల్లా అధ్యక్షుడు దేవేందర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

పోలీసులు కళ్లముందే… కర్ఫ్యూ నిబంధనలు… హుష్ కాకి..!

Satyam NEWS

హ్యాపీ పొంగల్: కుటుంబ సభ్యులతో వేడుకల్లో గవర్నర్

Satyam NEWS

మాస్క్ లేకుండా షాపు నడిపే యజమానికి భారీ జరిమానా

Satyam NEWS

Leave a Comment