38.2 C
Hyderabad
May 5, 2024 20: 01 PM
Slider ప్రపంచం

ప్లేన్ క్రాష్:బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ తో సహా 9మృతి

american basket ball kobe brayant plane crash 9 died

అమెరికన్ బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాప్టర్ ప్రమాదం లో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కోబ్ బ్రయంట్ అతని 13 ఏళ్ల కుమార్తె జియానా మరియా ఒనోర్ బ్రయంట్ తో పాటు 9మంది మరణించినట్లు అధికారవర్గాలు తెలుపుతున్నాయి. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పొగమంచు వాళ్ళ ముందుకు వెళ్లలేక కుప్పకూలి, కాలాబాసాస్ పైన ఉన్న కొండలలో మంటలు చెలరేగడంతో వారంతా అక్కడికక్కడే మరణించారని స్థానిక మీడియా తెలిపింది.


ఆదివారం మధ్యాహ్నం జరగాల్సిన బాస్కెట్‌బాల్ ఆట కోసం వారు బయలుదేరినట్లు సిఎన్ఎన్ నివేదించింది.ఈ ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని లాస్ ఏంజిల్స్ కౌంటీ అగ్నిమాపక విభాగం చీఫ్ డారిల్ ఓస్బీ తెలిపారు. ప్రమాదానికి గురైన సమయంలో ఎస్ -76 హెలికాప్టర్‌లో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.


41 ఏళ్ల బ్రయంట్ లాస్ ఏంజిల్స్ లేకర్స్ తరఫున ఆడుతుండగా తన 20 సంవత్సరాల కెరీర్‌లో ఐదు నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.బ్రయంట్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు,

Related posts

ప్రొబేషన్ డిక్లరేషన్ మహిళా సంర‌క్ష‌ణ పోలీసులకు త్వరలో శిక్షణ

Satyam NEWS

ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో భారత విద్యార్థులకు పతకాలు

Bhavani

దొంగ పాదయాత్రలు ఆపి ప్రజలకు సేవ చేయండి

Satyam NEWS

Leave a Comment