37.2 C
Hyderabad
April 26, 2024 20: 28 PM
Slider నిజామాబాద్

దొంగ పాదయాత్రలు ఆపి ప్రజలకు సేవ చేయండి

#YellareddyCongress

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే జాజల సురేందర్ పూర్తిగా విఫలం అయ్యారని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజక ఇంచార్జ్ విమర్శించారు..

శుక్రవారం వారు విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. నియోజకవర్గంలో ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంపు పై ఎమ్మెల్యే స్పందించక పోవడం  దారుణమన్నారు.

ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచాలని గతంలో పాదయాత్ర చేసిన సురేందర్ ఎమ్మెల్యే పదవిని వరించగానే ప్రాజెక్టు ఎత్తు పెంపు పై మాట్లాడక పోవడం ఇక్కడి రైతులను నిండా ముంచడమే అన్నారు. నియోజకవర్గ  ప్రజల చిరకాల స్వప్నం అయిన ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు ను సైతం విస్మరించిన దద్దమ్మ ఎమ్మెల్యే అని అన్నారు.

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఇల్లేందు ఎమ్మెల్యే హరిప్రియ తన నియోజకవర్గ పరిధిలో బస్సు డిపో ఏర్పాటు చేయించుకుంటే అదే అభివృద్ధి పేరిట పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. వంద పడకల ఆసుపత్రిని సీఎం కేసీఆర్ మంజూరు చేస్తానని ఇచ్చిన హామీని సాధించడంలో సైతం విఫలమయ్యారని అన్నారు.

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కు చిత్తశుద్ధి లేదని అన్నారు.. సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉంటే వెంటనే అర్హులకు డబుల్ బెడ్రూం లు అందజేయాలని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

ఇవన్నీ చేతగాని ఎమ్మెల్యే కు ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని వారి దృష్టిని మరల్చడానికి పాదయాత్ర పేరిట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

దొంగ పాదయాత్రలు ఆపి, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే ఎమ్మేల్యే కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు హఫీజ్, వైస్ ఎంపీపీ నర్సింలూ,MPTC శ్రీధర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ గాయజోద్దీన్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, బాలరాజు గౌడ్,షరీఫ్ పరందములు, చిరంజీవులు, గోవింద్, లింబేస్ నాయక్, నారగౌడ్,సాయిరెడ్డి, మహేష్, యూనస్,ముక్తర్, ఖదీర్, సురేష్,భాస్కర్, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

చిత్తూరు మాజీ ఎంపి శివప్రసాద్ మృతి

Satyam NEWS

ఉత్త‌మ ర్యాంకులు సాధించిన గిరి పుత్రులు…!

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థకు అగ్నిపరీక్ష

Satyam NEWS

Leave a Comment