గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో అధికార మహా అఘాడీ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రారంభించింది. రూ.10కే భోజనం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. ‘శివ భోజన్’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనుంది.‘శివ భోజన్’ పథకాన్ని పలువురు మంత్రులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లాంఛనంగా ప్రారంభించారు.తమిళ్ నాడులో అమ్మ కాంటీన్లు,ఆంధ్రప్రదేశ్ లో అన్న కాంటీన్లలో ,తెలంగాణాలో 5 రూపాయల భోజన పతకం తో ఈ పథకాలు నడవగా ఆంధ్రలో జగన్ ప్రభుత్వం అన్న కాంటీన్లను మూసివేసింది. మహారాష్ట్రలో కేవలం రూ.10కే పేదలకు భోజనం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన శివసేన దాని అమలుకు శ్రీకారం చుట్టడం విశేషం.