వనపర్తిలోని రాజీవ్ చౌక్ లో రోడ్డు ప్రక్కన బాధితుల దగ్గర వసూలు చేసిన డబ్బులు వాపస్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత లక్కాకుల సతీష్ డిమాండ్ చేశారు. డబ్బా ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒకరి దగ్గర యాబై వేల రూపాయల ప్రకారం లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారని అయన చెప్పారు. చాలా సంవత్సరాలనుండి రోడ్డు ప్రక్కన ఉన్న వారికి స్థలం ఇవ్వకుండా లంచం ఇచ్చిన వారికి అవకాశం ఇచ్చారని అయన విమర్శించారు. వనపర్తి టౌన్ చరిత్ర, వ్యక్తుల నిజాయితీ తనకు తెలుసన్నారు. ప్రజలు అందరిని గమనిస్తున్నారని అయన చెప్పారు. మునిసిపల్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని అయన కోరారు. మునిసిపల్ పాలన అద్వానంగా ఉందని అయన విమర్శించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్