త్వరలో జనంలోకి వెళ్లాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడిని సీఎం జగన్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అరెస్టు చేసిన తర్వాత ఎంతో మంది వేదనతో మరణించారు. అప్పటిలో ఆ కుటుంబాలను పరామర్శించాలని నారా భువనేశ్వరి నిర్ణయించారు. ఆమె పలు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల ఆర్ధిక సాయం కూడా అందించారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ యాత్ర సాగలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ సిద్ధంకాగా తాజాగా భువనేశ్వరి కూడా పర్యటనలు ప్రారంభించబోతున్నారు. దీనికోసం భారీ రూట్ మ్యాప్ సిద్ధం అయింది. ఈ నెల 5 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు ప్రారంభం అవుతున్నా. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి. కనిగిరిలో ప్రారంభం కానున్న చంద్రబాబు తొలి బహిరంగ సభ తో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి సభకు లక్ష మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా లోకేష్ పర్యటన చేయబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ అవ్వని నియోజక వర్గాలకు నారా లోకేష్ వెళ్ళనున్నారు. అదే విధంగా నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పర్యటన ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటన మూడు రోజులపాటు కొనసాగనున్నది. రేపు విజయనగరంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్థాపానికి గురై మృతిచెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు.