37.2 C
Hyderabad
May 6, 2024 11: 18 AM
Slider ముఖ్యంశాలు

ఎనాలసిస్: పైపైకి ఎగబాకుతున్న కరోనా కేసులు

#Covid Casess in India

కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాలలో భారతదేశం పైపైకి ఎగబాకుతున్నది. గడచిన 24 గంటల్లో 7000 కు పైగా కొత్త కేసులు నమోదు కావడం, ఇప్పటివరకు  4000 దాటిన మరణాలు వైరస్ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఇప్పటికీ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో వైరస్ కేసుల నమోదు ఎక్కువగా ఉంది. దేశంలోని మొత్తం కేసులలో దాదాపు 90 శాతం ఈ రాష్ట్రాలలోనే ఉన్నట్లు కేంద్ర  ప్రభుత్వం చెబుతోంది. తాజాగా అస్సాం, బీహార్, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ,ఒరిస్సా రాష్ట్రాలలో కోవిడ్-19 కేసులు ఎక్కువవుతున్నాయి.

భయాందోళనలకు గురి అవుతున్న జనం

4.0 లాక్ డవున్ మే 31తో  ముగియనుండగా… దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుతుండడంతో సాధారణ ప్రజానీకంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లాక్ డవున్ ను  కఠినంగా పాటిస్తున్నా సమస్య తీవ్రత తగ్గకపోవడం, మున్ముందు చోటుచేసుకునే పరిణామాలు  ఏ స్థాయిలో ఉంటాయనే విషయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో జూన్ 30 వరకు లాక్ డవున్ పొడిగించిన నేపథ్యంలో…. మహారాష్ట్ర వంటి అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్టాలలో లాక్ డవున్ మరోసారి పొడిగించడం అనివార్యమని తెలుస్తోంది. అంతర్రాష్ట్ర రవాణా పునరుద్ధరణకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్ర ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

మరో రెండు నెలలు మరింత క్లిష్టం

అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల రవాణాకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వైద్య,ఆరోగ్య నిపుణుల అంచనా మేరకు రానున్న రెండు నెలల కాలం మరింత క్లిష్టంగా ఉండగలదని, వైరస్ నియంత్రణకు సంసిద్ధగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అధికారులు కూడా కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని, విపత్తు ఎదుర్కొనేందుకు ఐసోలేషన్ వార్డులు, పీపీఈ కిట్స్ , ఔషధ సామాగ్రి మొదలైన వాటిని సమకూర్చుకోవాలని రాష్ట్రప్రభుత్వాలకు సూచిస్తున్నారు.

వాక్సిన్ అతి కీలకమైన క్లినికల్ ట్రయల్స్

ఇదిలావుండగా… కోవిడ్-19 వైరస్ ను సమూలంగా నాశనం చేయగల వాక్సిన్ అతి కీలకమైన క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు సమాచారం. దాదాపు 100 పైగా ప్రాంతాల్లో వాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. వారి కృషి ఫలించి సామాన్య ప్రజలకు వాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని అనుకుంటున్నారు.

ఈ లోగా వైరస్ ఉద్ధృతి పెరిగితే కేంద్రప్రభుత్వం స్పందన ఏమిటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రజారోగ్య పరిరక్షణ.. దేశఆర్ధిక స్వావలంబన.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగకతప్పదని ప్రధాని మోదీ చేసిన ప్రకటన…లాక్ డవున్ సడలింపుల నేపథ్యంలో పెరుగుతున్న కరోనా విజృంభణ పై వివిధ రంగాల ప్రముఖులు, విశ్లేషకులు స్పందించాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అంతిమంగా బలయ్యేది సామాన్య ప్రజలే.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

ఫస్ట్ టైం:మహిళా పోలీసుల కోసం మొబైల్ టాయిలెట్

Satyam NEWS

విద్యా విభాగ పరిశోధనపై నవీన్ కు డాక్టరేట్

Bhavani

ఆనాడే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు

Satyam NEWS

Leave a Comment