39.2 C
Hyderabad
May 3, 2024 11: 56 AM
Slider ప్రత్యేకం

ఆఖరు నిమిషంలో స్టూడెంట్స్ కు హ్యాండిచ్చిన కార్పొరేట్ కాలేజీలు

#Online Clasess

కార్పొరేట్ కాలేజీలే స్టూడెంట్స్ కు హ్యాండిచ్చాయి. కరోనా ఎఫెక్ట్ తో ఆన్ లైన్ క్లాసులలోకి దిగి, ఆన్ లైన్ పాఠాలు చెబుతున్న కార్పొరేట్ కాలేజీలు ఇప్పుడు అది కూడా మానేశాయి. టెన్షన్ లో ఉన్న విద్యార్ధిని ఆదుకోవడం అటుంచి ఏకంగా శలవులు ప్రకటించేసి కార్పొరేట్ కాలేజీలు చేతులు దులుపుకున్నాయి.

అసలు సంగతి ఏమిటంటే ఆన్ లైన్ లో బోధించేందుకు లెక్చరర్లు రావడం లేదని తెలిసింది. లెక్చరర్లు ఎందుకు రావడంలేదా అని వాకబు చేస్తే అత్యాసకు పోయి ఉన్నది ఊడగొట్టుకునే బుద్ధి ఉన్న ఈ కార్పొరేట్ కాలేజీలు వారికి జీతాలు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

రెండు ప్రధానమైన కార్పొరేట్ కాలేజీలు కరోనా ఎఫెక్ట్ పేరుతో సగం జీతం మాత్రమే లెక్చరర్లకు ఇస్తున్నాయి. గత నెల ఇదే విధంగా సగం జీతం ఇవ్వడం, ఈ సారి కూడా 26వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకుండా మళ్లీ సగం జీతమే ఇస్తామని బేరం పెట్టడంతో ఒక్క సారిగా లెక్చరర్లు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు.

ఇంత కాలం క్లాస్ రూం లలో పాఠాలు జరిగేవి. అప్పుడు జూనియర్ లెక్చరర్లతోనూ, ఆఫీస్ సిబ్బందితోనూ మేనేజ్ చేసి కాలేజీలు నడిపేవారు. మీరు రాకపోయినా కాలేజీ నడుస్తుంది అని చెప్పి లెక్చరర్లతో బేరాలు కుదుర్చుకునేవారు. అయితే ఆన్ లైన్ క్లాస్ లో ఆ పప్పులు ఉడకడం లేదు. జూనియర్లతో పని కాదు.

దాంతో కచ్చితంగా సీనియర్లనే ఆన్ లైన్ క్లాస్ తీసుకునే విధంగా చూడాలి. జీతాల్లో కోత విధిస్తున్న కారణంగా చాలా మంది లెక్చరర్లు మొహం చాటేయడంతో కార్పొరేట్ కాలేజీలు బిక్కమొహం వేశాయి.  

Related posts

హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు

Satyam NEWS

రామప్ప దేవాలయం విశిష్టత పై కవితల పోటీ

Satyam NEWS

హుజూరాబాద్ కు మరో రూ.500 కోట్లు విడుదల

Satyam NEWS

Leave a Comment