40.2 C
Hyderabad
May 2, 2024 16: 45 PM
Slider ముఖ్యంశాలు

ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

#Supreme Court of India

విశాఖ పట్నంలో విషవాయువు లీక్ అయి 12 మంది మరణించిన సంఘటనకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తమను ప్లాంట్ లోకి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ లేదా హైకోర్టు కేసును పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్లాంట్ లోకి వెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎల్జీ ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. గ్యాస్ లీక్ సంఘటనపై ఏడు కమిటీలు విచారణ జరుపుతున్నాయని ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణకు నిరాకరించింది.

Related posts

చూస్తూ ఊరుకోం అధికారపార్టీ దుమ్ము దులుపుతాం

Satyam NEWS

చివరి షెడ్యూల్ లో స్కై

Satyam NEWS

ఎస్ సి ల భూమి ఆక్రమించిన వైసీపీ నేతకు హైకోర్టు నోటీసు

Satyam NEWS

Leave a Comment