26.7 C
Hyderabad
April 27, 2024 07: 06 AM
Slider జాతీయం

చైనా, పాకిస్తాన్ కు తప్ప అన్ని దేశాలకూ కరోనా వ్యాక్సిన్

#CoronaVaccine

దేశంలో పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న భారత్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ను పక్క దేశాలను పంపడం ప్రారంభించింది. అయితే భారత్ కరోనా వ్యాక్సిన్ ను పాకిస్తాన్, చైనాలకు మాత్రం పంపడం లేదు. తొలి కంటెయినర్ ఇప్పటికే భూటాన్ చేరుకున్నది.

రేపు ఎల్లుండి బంగ్లాదేశ్, నేపాల్ కు భారత్ పంపుతున్న వ్యాక్సిన్  చేరుకుంటుంది. ప్రపంచంలోనే భారత్ వ్యాక్సిన్ లు తయారు చేసే అతి పెద్ద దేశం అనే విషయం మనకు తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్ ను కూడా అతి ఎక్కువ డోసులు ఉత్పత్తి చేస్తూ దేశంలో వినియోగించడమే కాకుండా పక్క దేశాలకు కూడా పంపడం భారత్ ప్రత్యేకత. మాల్దీవ్స్ కు కరోనా వ్యాక్సిన్ చేరిందని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు.

శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, మారిషన్ లకు వ్యాక్సిన్ స్టాక్ పంపేందుకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అప్పుడు ఆ దేశాలకు కూడా భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ చేరుతుంది.   

Related posts

జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

Bhavani

టికెట్లపై సెంట్రల్ కమిటీదే ఫైనల్

Bhavani

ప్రజల సమస్యలు పరిష్కారించడమే నా ధ్యేయం

Satyam NEWS

Leave a Comment