Slider కడప

ఎనదర్ స్టోరీ: ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ గ్రామంలో…

#PullampetMandal

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పుల్లంపేట మండలం దొండ్లోపల్లె లో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదు అయింది. దీనితో అభం శుభం తెలియని ఆ గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటి వరకూ ఏం కాలేదు కానీ… వారి మొహాల్లో భయం స్పష్టంగా కనిపిస్తున్నది.

49 సంవత్సరాల ఒక వ్యక్తి నెల్లూరు లోని రాయలసీమ హోటల్ లో పనిచేసేవాడు. గతనెల పొదలకురు శ్రీనివాస హోటల్ లో పనికి చేరాడు. అయితే లాక్ డౌన్ పొడిగించడం తో పని లేదని హోటల్ వారు చెప్పడంతో ఈ నెల 23వ తారీఖున ఇంటికి బయలుదేరాడు. కూలీగా అరటి పండ్ల లారీలో చిట్వేల్ కు చేరుకున్నాడు.

అక్కడ వేరే వారిని లిఫ్ట్ అడిగి స్కూటర్ పై మునక్కాయల పల్లెకు, అక్కడ నుంచి బెస్త పల్లె వరకు మళ్ళీ స్కూటర్ పై లిఫ్ట్ తీసుకుని వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ వేరే వారితో స్కూటర్ పై పెనగలూరు మండలం ఇండ్లూరు లో తన చెల్లెల్లు ఇంటికి వెళ్లినట్లు పోలీసులు సమాచారం.

కాగా అక్కడ నుంచి అరటి కాయ అరటి కాయ లోడులో రాజంపేటకు చేరుకున్న అతను రాజంపేట నుంచి పుల్లంపేట కు నిత్యావసర సరుకుల ఆటోలో దొండ్లపల్లి కి చేరుకున్నాడు. అప్పటికే జ్వరం తో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి గత శనివారం కరోనా పరీక్ష నిర్వహించగా, పాజిటివ్ గా మంగళవారం నిర్ధారణ అయ్యింది. డిఎస్పీ నారాయణ రెడ్డి, వైద్య బృందాలు గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను కడపకు తరలించారు. వైద్య, రెవిన్యూ, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా బాధితుడు ఎక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు అనే దిశలో డిఎస్పీ నారాయణ రెడ్డి వారందరిని వెతికే పనిలో ఉన్నారు.

Related posts

రాష్ట్రపతి ఎట్ హోమ్ కు హాజరైన నందలూరు బిడ్డ

mamatha

మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారం

Satyam NEWS

వైభవోపేతంగా శ్రీ సంజీవరాయ స్వామి వారి పొంగళ్ళు

Satyam NEWS

Leave a Comment