29.7 C
Hyderabad
May 2, 2024 04: 20 AM
Slider రంగారెడ్డి

కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన మరో వాహనం

44వ జాతీయ రహదారిపై వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ ను మరో వాహనం వెనకాల నుంచి ఢీకొనడంతో కెమికల్ లీకై ప్రమాద భరితంగా మారిన ఘటన జడ్చర్ల నియోజకవర్గంలోని రాజపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ నుండి హైదరాబాద్ కు కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ ను రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై వెనుక నుండి గుర్తుతెలియని మరో వాహనం ఢీకొంది.

దీంతో ట్యాంకర్ కు వెనుక భాగంలోని అన్లోడ్ చేసే పైప్లైన్ డ్యామేజ్ కావడంతో కెమికల్ లీకై రోడ్డుపై పడడంతో రోడ్డుపై పొగలుచున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా కెమికల్ దుర్వాసన పొగలతో ఆ ప్రాంతంలోనివారి కండ్లు మంటలు లేశాయని తెలిపారు. దీంతో అప్రమత్తమైన ట్యాంకర్ డ్రైవర్ ట్యాంకర్ ను జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపైకి తీసుకువెళ్లి ఆ ప్రాంతమంతా నీళ్ళు చెల్లడంతోపాటు ట్యాంకర్ లీకేజీని నివారించడంతో పెను ప్రమాదం తప్పింది.

లేకుంటే ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి ట్యాంకర్ పేలిపోయి పెను ప్రమాదం సంభవించేదని, విషపూరితమైన కాలుష్యం వెదజల్లేదని డ్రైవర్ ఆప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Related posts

బెడిసికొడుతున్న భారీ స్కెచ్

Satyam NEWS

యాదాద్రి, వర్గల్ దేవాలయాలకు ఫడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు

Satyam NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Satyam NEWS

Leave a Comment