29.7 C
Hyderabad
May 1, 2024 08: 13 AM
Slider ప్రత్యేకం

బెడిసికొడుతున్న భారీ స్కెచ్

#CM Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక వైకాపా సర్కార్ భారీ స్కెచ్ వేసినట్లు రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్రణాళిక తో చంద్రబాబు ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్ట్ లో హాజరు పరిచారు. ఏపీ సీబీసీఐడి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు ను రాజమండ్రి జైలు కు తరలించారు. న్యాయపరమైన అంశాలను పక్కన పెట్టి రాజకీయ కోణం చూస్తే ఈ మొత్తం పరిణామాల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లే కనిపిస్తున్నది.

చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా వైకాపా తన పంతాన్ని నెగ్గించుకుంది. వాస్తవానికి జగన్ పై కేసులు పెట్టింది, ఆయనను అరెస్టు చేయించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించింది. జగన్ ఫై ఫిర్యాదు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే గానీ తెలుగుదేశం పార్టీ వారు కాదు. అయితే తనను అరెస్టు చేయించింది చంద్రబాబునాయుడే అనే వాదనను బయటకు తీసుకువచ్చిన వైకాపా విస్తృత ప్రచారం చేసింది.

దాన్ని చాలా మంది ప్రజలు నమ్మారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మళ్లీ చంద్రబాబునాయుడిని గెలిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీని ఏమీ అనని జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీపై తనకున్న కోపాన్ని తెలుగుదేశం పార్టీ వైపు మరల్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 20014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైకాపా తెలుగుదేశం పార్టీనే తనను అరెస్టు చేయించిందనే ప్రచారం బలంగా చేసింది.

తనను అరెస్టు చేయించిన తెలుగుదేశం పార్టీని తనకు అవకాశం దొరికితే దెబ్బ కొడతాను అంటూ జగన్ తన ఎన్నికల ప్రచారం లో గట్టిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని తెలుగుదేశం పార్టీ పై వ్యక్తిగత కక్ష గా చిత్రీకరించిన వైకాపా నేతలు ఇప్పటికి సక్సెస్ అయ్యారు. తాను కక్ష తీర్చుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేక తెలుగుదేశం పార్టీని విలన్ గా చూపించడం వెనక ఉన్న ఈ భారీ స్కెచ్ వెనుక ప్రస్తుతం రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి.

నాయకుడిని దెబ్బ కొడితే.. వారి సైన్యం దిక్కు తోచని స్థితిలోకి పోయి.. టీడీపీ పార్టీ చెల్లా చెదురు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.. చంద్రబాబు తో లోకేష్ ను కూడా రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారు అని టాక్ నడుస్తుంది.. చంద్రబాబు బెయిల్ కోసం నేడు హైకోర్టు ను ఆశ్రయించారు.. ఆయనకు నేడు బెయిల్ లభిస్తే.. టీడీపీ విజయం సాధించినట్టే.. ఎందుకంటే ఈ మూడు రోజులు జరిగిన అన్ని పరిణామాలు టీడీపీ కి ప్లస్ అనే చెప్పాలి.. ఎలక్షన్ క్యాంపెన్ గా ఉపయోగపడినట్టే.. జనం చంద్రబాబు కు సంఘీభావం తెలిపారు.. పెళ్లి రోజు నాడు అరెస్ట్ చేశారు అనే సానుభూతి సైతం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.. ఎటు చూసిన ఇవన్నీ టీడీపీ కు ప్లస్ చేశాయి అనడంలో సందేహమే లేదు…

ఒక వేళ హైకోర్టు లో చంద్రబాబు కు బెయిల్ రాకపోతే.. సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తారు.. అక్కడ బెయిల్ రాకపోతే..కనీసం 6 నుండి 7 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని వైసీపీ ప్లాన్ చేసింది.. దీనితో చంద్రబాబు జైల్ ఉంటే..టీడీపీ బలహీన పడుతుందని, లోకేష్ ను ఇదేవిధంగా జైల్ కి పంపిస్తే.. ఇద్దరు ముఖ్య నాయకులు జైల్లో పెట్టిస్తే.. ఎలక్షన్ టైం కి టీడీపీ పూర్తిగా డీలా పడేటట్టు చేయాలని వైకాపా ప్లాన్ లు వేస్తున్నారు.. వీరు ఇద్దరు జైల్లో ఉంటే పార్టీని నారా భువనేశ్వరి,నారా బ్రహ్మణి లు నెగ్గుకురాగలరా..

సీట్లు పంపకం, ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, నిధులు సమకూర్చడం వంటివి చేయగలరా… బలమైన నాయకులు పార్ట్ ని  విడితే వీళ్ళు అపగలరా అనే వరకు వైకాపా లెక్కలు వేస్తుంది.. టీడీపీ కేడర్ ను చెల్లా చెదురు చేసి.. పార్టీని బలహీన పరిచి..  తమకు అధికారానికి రూట్ వేసుకునే విధంగా వైకాపా భారీ ప్లాన్ చేస్తుంది.. బెయిల్ రాకపోతే నే వీరు స్కెచ్ అమలు చేస్తారు.. ఒకవేళ హైకోర్టు లోనే చంద్రబాబు కు బెయిల్ లభిస్తే మాత్రం … వైకాపా తన గోయ్యి తానే తవ్వుకుంది అనే చందగా వారి పరిస్థితి మారుతుంది.

పూడి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

కరోనా నుంచి కోలుకున్న డాక్టర్ రాజశేఖర్

Satyam NEWS

ఇద్దరు నానీలకు మళ్లీ మంత్రి పదవి యోగం?

Satyam NEWS

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ అర్హత అభ్యర్ధులకు రాత పరీక్ష

Satyam NEWS

Leave a Comment