30.7 C
Hyderabad
April 29, 2024 04: 40 AM
Slider కవి ప్రపంచం

కనుల భాష్యం

#Kondapally Niharini

కలల మందిరానికి తపనల తాళమేసి

మమతల పందిరి క్రింద కోసుకున్న పూలన్నీ హృదయాంజలి కోసమే

అక్కడ విరిసిన నవ వసంతం నుండి రెక్కలార్చాలనే శిశిరం వరకు

గమ్మత్తు ఆశలతోనే నా స్నేహం

దారెంటబోతుంటె దాటుకుంటూ వస్తుంటే

తరాలుమోసిన  తరువు విసిరిన

చూపులతూపుల్ని

క్రీగంట  గమనికలను చూసి  గరికపూలు ఊదారంగు నవ్వుల్ని విరిసి

హాయిగా  ఆహ్వానిస్తున్నాయి

ఏమో అనుకున్నాను

ఎంత దోబూచులాడుతున్నదో

ఈ నిశ్శబ్దపు రోజు

నాలోని  మానస వీణియను మీటిన

శాంతిస్వరాలు

పూర్వాపరాలన్నీ  సుస్వర గీతాలనే పాడుతూ

ఆశావహక దీపికా శింజిని

ఆస్వాదనల కోసం

బడలిక మరచి పయనిస్తున్న

సుందరతలో బాతులు , మేకలు కూడా వరసలుదీరి కనువిందుల పంటయినవి

వాకిళ్ళ ముందు మురిసి పోతున్న బోగన్ విల్లా నవ్వులు

చిగురుతొడుగుతున్న చింతచెట్ట

మరికొంత దూరం తీసుకెళ్లినవి

పొలం గట్టున కొబ్బరి చెట్టు పొడగరినని గడుసరితనపు  పోకడలుబోతున్నది 

ఊళలు ,  కలల్లోని ఊడలమానూ  ఊరందరికి ఆలవాలమైన ఒంటరి జమ్మి

పాఠాలకు చేరుతున్న సంస్కృతి

పట్టణాల బ్రతుకుబండికి ఊతమయినవి

అస్తమయ సౌందర్యాన్ని చూడమనే దినకరుడు ఎంతగా కవ్విస్తుంటాడో

సకల కళా పారంగత సృష్టికి

నేనే తోడని బుడుంగున కొండెనుకకు పరుగుపెట్టాడు

సంబరాల సందూక బహుమతినిచ్చే భావ తేజో సంపన్నత కలగలిపి

నాతో సరాగాలాడుతాడు

నాలో ఓజోగుణ విజృంభణ చేయిస్తాడు

అతని రాక తో అంతరంగమంతా

క్రొంగొత్త కాంతులీనుతుందని తెలుసు

కాకపోతే

రాని నిదురకు

పోని చందురునికి వంతెనైన ఈ రాతిరి

సహచరి నా ఎద మీది నుండి తొందరగ తొలగక

కథల నందన వనంలో

నన్నో తెరువరిని చేస్తున్నదిగాని

మారు చక్షువులను ముక్కుమించి పైకి జరుపుకుంటేగాని

అక్షర పుష్పాల వెనుక తూనీగనవుతానన్న సత్యం

మౌన భాష్య మయ్యింది

‘కన్నులు ‘ కవర్ చేసే ‘పవర్’

మాధ్యమంలో

చదువుల గుడిగా నా గుండె గళం నిశ్శబ్దాన్ని భేదిస్తూ కొత్త పాఠాన్ని వల్లె వేయిస్తున్నది

నేనిప్పుడు ముచ్చట్లల్ల పట్టుకోలేని వాక్యాన్ని!

డా॥ కొండపల్లి నీహారిణి

Related posts

Solidarity: మరో పోలీసు అధికారికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

బిఆర్ఎస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు

Satyam NEWS

డ్రోన్ బాంబ్:రక్తసిక్తమైన యెమెన్ 80 మంది మృతి

Satyam NEWS

Leave a Comment