28.7 C
Hyderabad
May 6, 2024 01: 10 AM
Slider సంపాదకీయం

ఏపిలో అధ:పాతాళానికి పడిపోయిన బిజెపి గ్రాఫ్

#Somu Veeraju

విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన నాటి కన్నా ఘోరమైన పరిస్థితులలోకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బిజెపి వెళ్లిపోయింది. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం చేయడానికి ఒక రోజు ముందు న్యూఢిల్లీలో రాష్ట్ర బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ స్వీకారం చేశారు.

ఆ సందర్భంగా సోము వీర్రాజుతో బాటు మీడియాతో మాట్లాడిన వారిలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు, పార్టీ ఇన్ చార్జి ధియోదర్ ఉన్నారు. వీరంతా కూడా రాజధాని కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేనని స్పష్టంగా చెప్పారు.

కేంద్రం ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోదని కూడా వారు చెప్పారు. వారు ప్రకటించిన వెంటనే రాష్ట్ర గవర్నర్ వికేంద్రీకరణ బిల్లులపై సంతకాలు చేశారు. ఇదంతా కూడబలుక్కుని చేసింది కాకపోయినా జరిగిన సంఘటనలు పరిశీలిస్తే మూడు రాజధానుల వ్యవహారంలో తెరవెనుక బిజెపి ఉందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్ధం చేసుకున్నారు.

ఇంత కాలం బిజెపి మూడు రాజధానుల వ్యవహారంలో అడ్డుకుంటుందని అందరూ భావించారు. అయితే అలాంటిదేం జరగకపోగా బిజెపి నాయకులు కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పిన మరునాడే గవర్నర్ సంతకం చేయడంతో బిజెపి పాత్ర ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.

అంతకుముందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టంగా చెప్పారు. కర్నూలుకు హైకోర్టు తరలించడాన్నికూడా ఆయన సమర్థించారు. దీనికి భిన్నంగా కొత్త అధ్యక్షుడు మాట్లాడటం, వెంటనే బిల్లుకు చట్ట రూపం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ కోపం బిజెపి వైపు మళ్లింది.

గతంలో ఉన్న కోపం రెట్టింపు అయింది

అందుకే మూడు రాజధానుల వ్యవహారంపై ఒక్క సోము వీర్రాజు తప్ప వేరే నాయకులు ఎవరూ కూడా మాట్లాడడం లేదు. రాష్ట్ర విభజనలో పాలు పంచుకున్న బిజెపి పై అప్పటిలో ఆంధ్రా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ పర్యటన తర్వాత కొంచెం శాంతించి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కదా అని సర్దుకున్నారు.

అయితే చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దాంతో గత ఎన్నికలలో విడిగా పోటీ చేసిన బిజెపికి ఒక శాతం కూడా ఓట్లు రాలేదు. ఇప్పుడు మూడు రాజధానుల అంశంలో ఓవర్ నైట్ మాట మార్చిన బిజెపి గ్రాఫ్ ఏపిలో దారుణమైన పరిస్థితిలో పడిపోయింది.

బిజెపి పైన ఉన్న ఆగ్రహం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైన కూడా పడుతున్నది. ఈ సారి పడిన దెబ్బతో బిజెపి ఇక ఆంధ్రప్రదేశ్ లో మరో పదేళ్ల వరకూ కోలుకోదు అనే అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రభావం జనసేన పై కూడా పడే అవకాశం కనిపిస్తున్నది.

కన్నా లక్ష్మీనారాయణ తీసుకున్న స్టాండ్ పైనే బిజెపి ఉన్నట్లయితే మూడు రాజధానుల బిల్లు పాస్ అయినా సరే ఆగ్రహమో అనుగ్రహమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే ఉండేది. సోము వీర్రాజు తొందరపడి చేసిన వ్యాఖ్యలు బిజెపి కొంప ముంచాయి.

Related posts

క్లోజ్: ఏపి శాసన మండలి రద్దుకు క్యాబినెట్ ఓకే

Satyam NEWS

ముందస్తు ఎన్నికలు ఇక లేనట్టే

Satyam NEWS

కరెంటు చార్జీల మళ్లీ పెంచిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment