సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాపాటి నాగేశ్వర రావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే 129 వర్ధంతి సందర్భంగా చీమకుర్తి లో గల స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూల మాలలు వేసి ఏపీ ప్రజా సంక్షేమ సమితి ఘన నివాళి అర్పించింది.
ఈ సందర్భంగా సాపాటి నాగేశ్వర రావు మాట్లాడుతూ మహిళలు అన్ని విద్యా,ఉద్యోగ, రాజకీయ రంగాలలో రాణిస్తున్నారంటే దానికి కారణం మహాత్మా పూలె అని, మహిళలకు చదువు చెప్పేందుకు తన భార్యను మొదటి ఉపాధ్యాయురాలిగా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బిసి నాయకులు దొంతు యాదగిరి నరసింహారావు మాట్లాడుతూ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు.
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రేమల కరుణాకర్, జిల్లా కార్యదర్శి గోసి శ్రీనివాసరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.