42.2 C
Hyderabad
April 30, 2024 16: 49 PM
Slider ఆదిలాబాద్

అన్ ఫిట్ బస్సులతో ప్రయాణీకులకు పెద్ద ఇబ్బంది

asifabad

తాత్కాలిక డ్రయివర్లు, అన్ ఫిట్ బస్సులతో ప్రయాణీకులు ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు పనిలో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు ఎంతో క్రమ పద్ధతిలో నడిచేవి. బస్సుల మెయింటేనెన్స్ కూడా క్రమం తప్పకుండా జరిగేది. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో చాలా బస్సులు మూలనపడ్డాయి. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు ఆర్టీసీ సిబ్బంది వచ్చినా కూడా ప్రభుత్వం వారిని చేర్చుకోవడం లేదు. దినదిన గండంలా ఆర్టీసీ ప్రయాణం సాగుతున్నది.

తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ టు ఆసిఫాబాద్ వెళ్లే బస్సు బట్టు పెళ్లి చౌరస్తాలో బస్సు వెనక టైర్ లో నుండి పొగలు రావడంతో తో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేశాడు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు కానీ ఎన్నాళ్లు ఈ విధంగా ఆర్టీసీ బస్సులు అన్ ఫిట్ గా ఉంటాయని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. దగ్గర ఉన్న ఒక వ్యక్తి వాటర్ పైప్ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది.

Related posts

ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించాలి

Murali Krishna

ఆదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలి

Bhavani

శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Sub Editor

Leave a Comment