27.7 C
Hyderabad
May 15, 2024 04: 34 AM
Slider గుంటూరు

అరవింద బాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

#rajamaster

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹ చదలవాడ అరవింద బాబును నరసరావుపేట రూరల్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాసరి రాజమాస్టర్ అన్నారు.

రూరల్ మండలం పాలపాడులోని టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన విషయాన్ని అడగడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లిన అరవింద బాబు పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా,అరెస్టు చేసి స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే ప్రైవేట్ కేస్ వేయడంతో పాటు, పార్టీ పరంగా కార్యక్రమాన్ని చేపడతామని, అరెస్టు విషయాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష బాబు, అచెన్న నాయుడు,జి.వి ఆంజనేయులు తదితర పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన తెలిపారు.

పోలీసులను ముందు పెట్టి ఇష్టానుసారం పార్టీ నాయకులను,కార్యకర్తలను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలు చూస్తూ కూర్చోరని, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది అని దాసరి రాజా మాష్టారు అన్నారు.

Related posts

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS

ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారి పై చట్ట పరమైన చర్యలు

Satyam NEWS

కేంద్ర విధానాలపై ప్రజలను సమీకరించి పోరాడాలి

Satyam NEWS

Leave a Comment