28.7 C
Hyderabad
May 5, 2024 09: 42 AM
Slider కరీంనగర్

ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారి పై చట్ట పరమైన చర్యలు

#VemulawadaPolice

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలు కోవిడ్ నియంత్రణకు సంబంధించిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే ఇక నుండి కఠిన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం

1. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి, అదికూడా సరి అయిన పద్దతిలో పెట్టుకోవాలి అలాకాకుండా ముక్కు క్రిందకు, నోటి క్రిందకు పెట్టిన కూడా కేసు నమోదు చేయబడును.

2.సామాజిక దూరం పాటించాలి, షాప్ లు, హోటల్, ఇతర వ్యాపార సముదాయల యందు క్రమ పద్ధతి లో గుండ్రని వలయాలు, తాడుతో రక్షణ ఏర్పాట్లు చేయాలి, అదేవిదంగా శానిటైజర్ ఏర్పాటు చేయాలి లేనిచో అట్టి యజమాని పై చర్యలు తీసుకోబడును, భౌతిక దూరం పాటించని వారి పై కూడా చర్యలు తీసుకోబడును.

3. రాత్రి కర్ఫ్యు లో ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలు పాటించాలి. అనవసరం గా బయట తిరిగితే చర్యలు తప్పవు.

4.జనాలు గుమి గుడే విధంగా మీటింగ్స్, పెళ్లిళ్లు, ర్యాలీలు మరి ఏ ఇతర కార్యక్రమాలు నిర్వహించిన చర్యలు తప్పవు.

5. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, పాన్, గుట్కా, ఉమ్మిన కూడా కేసు నమోదు చేయబడును.

పైన తెలిపిన నిబంధనలు అతిక్రమిస్తే ప్రకృతి వైపరీత్యాల చట్టం -2005, మరియు అంటు వ్యాధుల నివారణ చట్టం క్రింద కేసులు నమోదు చేయటం జరుగుతుందని పోలీసు ఇన్ స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

Related posts

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

నాణ్యమైన, మన్నికైన ఔషదాలను ప్రజలకు అందించాలి

Satyam NEWS

భూకబ్జా పై నిరసన సెగ: సీపీఎం ధర్నా

Satyam NEWS

Leave a Comment