35.2 C
Hyderabad
May 1, 2024 03: 01 AM
Slider కవి ప్రపంచం

మేమొక్కరమే

#venanka chakravarthy

దైవం ప్రత్యక్షమైన దాఖలా లేదు

నన్నేదన్నా కోరుకోమన్న గురుతూ లేదు

వరమైతే ప్రసాదించబడింది ఆమెగా

పేరు కింద రాసుకునేంత చదవుకోలేదు

పేరుకి మించి రాయగల నేర్పూ లేదు

యే పరిశీలనా పాఠశాల నేర్పించిందో గాని

నా మనసు భాషలో

ఆమె పట్టా పొందిన పరిశోధకురాలు

నన్నే తనలో ఇముడ్చుకుందో

ఆమే నన్నంతా నిండిపోయిందో

నేనే వంటింటి పిడుగులను వినలేదు

నేనే అలక సంద్రాలను ఈదలేదు

నేనే కోరికల గాలులలో నెట్టేయబడలేదు

నేనే వ్యతిరేక సందర్భాలకు సమాధానాలు రాయలేదు

మా ప్రణయ జ్యోతి మాత్రమే సాక్షి

ఎలా తెలుసుకుందో

తేనె నదియై అలరించడం

ఎక్కడ అభ్యసించిందో

పూల రాశుల దారుల్లో నడిపించడం

ఎప్పుడు ఒంటబట్టించుకుందో

నిత్య వాసంతమై పరవశింపజేయడం

ఆనంద కెరటాలతో ఓలలాడుతున్నది బ్రతుకు

ఏదో జన్మలో

ప్రేమ తపస్సు చేసినందుకే అనుకుంటా

ఇంకేదో లోకంలో

అనురాగ ఆరాధనలో అర్హత సాధించినందుకే ననుకుంటా

ఇపుడిలా

తనలోని నేనుగానో

నాలోని తనుగానో

ఒక్కరమై సాగుతున్నామీ సంసార వైభవం

వేనంక చక్రవర్తి, లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా, 9000983494

Related posts

పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

కారు వైప‌ర్ ద్వారా రాబ‌రీని చేధించిన నెల్లిమ‌ర్ల పోలీసులు…!

Satyam NEWS

టీఆర్ఎస్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డ‌తాం

Sub Editor

Leave a Comment