42.2 C
Hyderabad
May 3, 2024 15: 49 PM
Slider జాతీయం

పరాయివారిపై ప్రేమ మన దేశం వారిపై చిన్న చూపు

aravind kejriwal

అందరిని కలుపుకుని వెళతామని చెబుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే అందరిని కలుపుకుని వెళుతున్నారు. అందరూ అంటే ఎవరు? రోహ్యాంగాలు, బంగ్లాదేశీయులు. అంతే తప్ప మన దేశానికి చెందిన వారు కాదు.

అయితే మన దేశానికి చెందిన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో పని చేసుకుంటున్న భవన నిర్మాణ కార్మికులను మాత్రం నానా తిప్పలు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహ్యాంగాలు, బంగ్లాదేశీయులకు ఇంటికే సరుకులు పంపుతున్నారని వారి ఇళ్లకు నిరాటంకంగా కరెంటు ఇస్తున్నారని తమను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని ఉత్తర ప్రదేశ్, బీహార్ లకు చెందిన దినసరి కూలీలు అంటున్నారు.

చిన్న చిన్న గదుల్లో ఉండే తమకు కరెంటు, నీళ్లు కట్ చేస్తున్నారని వారు వాపోతున్నారు. రోహ్యాంగాలు, బంగ్లాదేశీయులు ఉండే చోట్ల అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచారని తాము ఉండే ప్రాంతాలలో అలాంటి సౌకర్యాలు లేవని కూలీలు ఫిర్యాదు చేస్తున్నారు.

దీనితో ఒక్కసారిగా 5 లక్షల మంది నిరుపేద కూలీలు ఏంచేయాలో దిక్కుతోచక రోడ్డుపైకి వచ్చారు. అంతేకాకుండా “మీమీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు మీ స్వంత ఇళ్ళకు పోవడానికి బస్సులు ఏర్పాటు చేశాయి” అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీనితో ముసలివారితో సహా మూటముల్లె సర్దుకుని ఆ అమాయకులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు. అయితే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి కూడా లేని స్థితిలో ఈ విధంగా చేయడం ఎంత వరకూ సబబని వారు ప్రశ్నిస్తున్నారు.

Related posts

పిన్నికి గుండె పోటు వస్తే జగన్ వాలంటీర్లతో ఎందుకు ఉన్నాడు?

Satyam NEWS

రాజన్న స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం

Satyam NEWS

నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం

Satyam NEWS

Leave a Comment