40.2 C
Hyderabad
April 29, 2024 15: 55 PM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ పాటిస్తున్న తరుణంలో విహెచ్ పి సేవలు

viswa hindu

కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు అందరూ ప్రయత్నం చేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు కోరారు.

ఈ కష్ట సమయంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలందరూ తమవంతు భాగంగా ట్రాఫిక్ నియంత్రణలో కాని, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాల వద్ద కానీ, కూరగాయల మార్కెట్ల వద్ద కానీ రద్దీని నియంత్రించే పనిని చేపట్టాలని సూచించారు.

అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా క్రబద్దీకరించడం, అవసరార్థులకు చేతనయినంత సరుకులను ఇప్పించడం, అన్నార్థులకు తయారు చేసిన ఆహారాన్ని అందించడం వంటి సేవా, సహయ కార్యక్రమాలు చేయాలని కేంద్రీయ అధికారుల నుండి సూచనలు వచ్చాయని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహాభూతాన్ని తరిమి కొట్టడానికి మన శాయశక్తులా కృషి చేద్దాం. ఈ సందర్భముగా అయోధ్య మహా నగరంలో జరుగుతున్నబాలరాముని భవ్యమందిర నిర్మాణానికి సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా జరుగుతున్న విషయాన్ని సంతోషంగా పంచుకుందాం.

కేంద్రీయ అధికారుల నుండి వచ్చిన సూచనలను పాటిద్దాం అని విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు తెలిపారు. కరోనా మహా భూతాన్ని ఈ భూమండలంపై లేకుండా చేయడం కోసం ఈ 21 రోజులు వచ్చిన అవకాశాన్ని వినియోగిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

అది ప్రతిరోజూ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి కరోనా నివారణ కొరకు అని సంకల్పం చెప్పి ఇష్టదేవతా పారాయణం చేసి చివరగా 13 అక్షరాల విజయ మహా మంత్రమైన “శ్రీ రామ జయ రామ జయజయ రామ” మంత్రాన్ని కనీసం 108 సార్లు, వీలైతే అంతకన్నా ఎక్కువ జపం చేయాలని కోరారు.

Related posts

తెల్ల రేషన్ కార్డుదారులకు జగన్ సర్కార్ షాక్

Satyam NEWS

గిఫ్ట్: శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ

Satyam NEWS

విజయనిర్మల మనవడు శరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్

Satyam NEWS

Leave a Comment