39.2 C
Hyderabad
May 3, 2024 13: 35 PM
Slider నిజామాబాద్

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి కారు చిచ్చు

#ArmoorMLA

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఏ పని చేసినా వివాదాస్పదం అయి వార్తలో నిలుస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికలలో వర్థమాననటి శ్రీరెడ్డి లైంగిక వేధింపుల విషయం బయటకు వచ్చింది. అలాగే దుబాయ్ లో బ్యాంకు ను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి.

అంతేకాకుండా దళిత యువకుల హత్యలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్మూర్ ఆర్టీసీ స్థలంలో నిర్మిస్తున్న క్లాంపెక్స్ పై రాద్దాంతం జరిగింది. తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.3  కోట్లతో కొనుగోలు చేసిన కారు జిల్లాలో చర్చనీయాంశం గా మారింది.

హైదరాబాద్ లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు మధ్య సంభాషణ సోషల్ మీడియా లో హల్ చల్ నడుస్తుంది. ఇన్ని రోజులు రాజకీయాలలో ఉండి రూ.20. లక్షల కారు కొనుగోలు చేశానని, ప్రస్తుతం ఈ కారు నొక్కులు పడిందని చెప్పారు. దీనితో ఇద్దరు కలిసి జగ్గారెడ్డి కారును చూశారు.

జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా తన రూ.3  కోట్ల కారు వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవన్ రెడ్డి దగ్గర కు వచ్చే వరకు కారు డోర్ తీసుకొని కూర్చున్నారు.

ఈ వీడియో వైరల్ కాగా ఆర్మూర్ కు చెందిన ఎమార్పీస్ జిల్లా అధ్యక్షుడు మైలావరం బాలు ఎర్పాటు చేసిన ప్లేక్సీల పై నియోజకవర్గం లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.3  కోట్ల తో కొత్త కారు కొన్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే నియోజకవర్గం ప్రజల కోసం కాకుండా ఎమ్మెల్యే కారు కోసమైన రోడ్డు వేయాలని ప్లేక్సీలలో కోరారు. ఆర్మూర్ పట్టణం లోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి.

పిప్రి గల్లీలో పేదల కోసం 1300  డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చిన దఖాలాలులేవని విమర్శించారు. పేదలకు ఇండ్లు కట్టించకుంటే ఇటీవల రూ.24  కోట్ల తో కొనుగోలు చేసిన ఇంటిని, ఆర్టీసీ కాంప్లెక్స్ ను పేదలతో కలిసి ఆక్రమించుకుంటామన్నారు.

Related posts

లక్కీ పోలీస్ :హత్య కేసు విచారిస్తుంటే ఐఎస్‌ఐ ఏజెంటు దొరికాడు

Satyam NEWS

సుప్రీంకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్

Satyam NEWS

డయల్ 100 కు 3022 కాల్స్

Murali Krishna

Leave a Comment