40.2 C
Hyderabad
April 29, 2024 17: 26 PM
Slider ఆదిలాబాద్

జూన్ 8 నుండి పదవ తరగతి మిగిలిన పరీక్షలు

#Nirmal Collector 1

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పదవ తరగతి (మిగిలిన పోయిన) వార్షిక పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శని వారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 8 నుండి జూలై 5 వరకు నిర్వహించు పదవ తరగతి మిగిలిపోయిన పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని, పిల్లలందరికీ ఫేస్ మాస్క్ లను, శానిటైజర్ లను అందజేయాలని సామాజిక దూరం పాటించేలా చూడాలని జిల్లా విద్య శాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు ముందు పరీక్ష అయిపోయిన తర్వాత బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోchlorite స్ప్రే చేయాలని దీనికోసం బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని, నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయాలని ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ని ఆదేశించారు.

విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జూన్ 8 నుండి ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తున్నందున, పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నందున విద్యార్థులందరూ ఉదయం 8.00 గంటలకే పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి టి ప్రణీత మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 46 కేంద్రంలో అదనంగా 25 కేంద్రాలు  మొత్తం 71 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అడిషనల్ సెంటర్లో పిల్లల అలాట్మెంట్ వివరాలు తెలుసుకునేందుకు deonml.weebly.com వెబ్ సైట్ లో గాని సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ద్వారా తెలుసుకోవచ్చన్నారు.  ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంత్ రావు, ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ చౌహన్, డిఎస్పి ఉపేందర్ రెడ్డి, డి పి ఓ శ్రీనివాస్, డి టి ఓ ప్రభాకర్ రెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో వాయిదా పడిన 1-9వ తరగతి పరీక్షలు

Satyam NEWS

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు

Bhavani

వరంగల్లు చిట్టితల్లికి అరుదైన గౌరవం

Satyam NEWS

Leave a Comment