30.7 C
Hyderabad
May 5, 2024 05: 31 AM
Slider ప్రత్యేకం

శాంతియుతంగా చేస్తున్న భారత్‌ బంద్‌ ను అడ్డుకోవడం పిరికిపంద చర్య

#revanthreddy

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అఖిల పక్ష పార్టీల ,రైతు సంఘాల నాయకులతో కలిసి శాంతి యుతంగా భారత్‌ బంద్‌ నిర్వహిస్తుంటే అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం పిరికి పంద చర్య అని టిపిసిసి చైర్మన్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను విదేశీ ,స్వదేశీ కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతోందని , ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటు పరం చేస్తోందన్నారు.

సోమవారం ఉప్పల్‌ బస్‌ డిపో వద్ద నిర్వహించిన ఆందోళనలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో , సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం,  టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, మందముల పరమేశ్వరరెడ్డి ని ఉప్పల్‌  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంయుక్త కాసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్‌లో బాగంగా ఉప్పల్‌ నియోజకవర్గంలోని  కాప్రా సర్కిల్‌ , ఉప్పల్‌ సర్కిళ్ళలో బంద్‌ పాక్షికంగా విజయవంతమైంది. ఉదయం నాలుగు గంటలనుండి కాంగ్రెస్‌, సిపిఐ, సీపీఎం, టిజెఎస్‌, టీడిపి, సిపిఐ ఎం (ఎల్‌ఎన్‌డి) పార్టీల నాయకులు కార్యకర్తలు కాప్రాలోని కుషాయగూడ , ఉప్పల్‌  ఆర్టీసీ బస్‌డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా ఆందోళన నిర్వహించారు.

కాప్రా, ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట వివిధ పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఆందోళనలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో పాటు టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డిని ఉప్పల్‌  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్‌ బస్‌డిపో వద్ద భారత్‌బంద్‌ దర్నా తో పుటాటలో అరుణోదయ సంస్థ సాంసృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు స్పృహ తప్పి పడిపోయారు.

సిపిఐ నాయకులు విఎస్‌ బోస్‌ ,సిపిఎం నాయకులు కె.వెంకట్‌, టిడిపి నాయకులు టి.జి.కె. మూర్తి, నీరుకొండ సతీష్‌బాబు, సాయి నాగార్జున, పసల ప్రసాద్‌, నాగేశ్వరావు,  తెలంగాణ జన సమితి నాయకులు భద్రగామ ఆంజినేయులు, గడ్డం యాదగిరి, పత్తికుమార్‌, పిఎస్‌ఎన్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నందీశ్వర ఆలయం కళ్యాణ మండపం నిర్మాణానికి దాతలు సహకరించాలి

Satyam NEWS

భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆధ్వ‌ర్యంలో ముట్ట‌డి

Sub Editor

జమ్మి చెట్టు విజయానికి ప్రతీక : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment