36.2 C
Hyderabad
May 12, 2024 19: 08 PM
Slider ముఖ్యంశాలు

నూతన మంత్రి వర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి

నూతన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని అఖిల భారత వాసవీ సత్రసముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. రాష్ట్రంలో 100 నియోజక వర్గాల్లో అభర్డుల గెలుపోటములు నిర్ణయించే బలమైన ఓటు బ్యాంకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం కు పైగా ఆర్యవైశ్య ఓటర్లు ఉన్నారన్నారు.

గత ఎన్నికల్లో తమ సామాజిక వర్గం అంతా వైకాపాకు మొగ్గు చూపి అత్యధిక సీట్లు గెలుపొందడంలో ప్రధాన పాత్ర పోషించామన్నారు. ఈ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి తొలి కేబినెట్లో వెల్లంపల్లికి సముచిత స్థానం కల్పించారని, అదే విధంగా నూతన మంత్రివర్గంలో ఆర్యవైశ్య ప్రతినిధులకు సముచిత స్థానం కల్పించాలని దేవకి సీఎం జగన్ ను కోరారు.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మంత్రి వర్గాల్లో ప్రాతినిధ్యం కల్పించారని, అదే ఆనవాయితీని సీఎం జగన్ పాటిస్తారని ఆర్యవైశ్య సామాజిక వర్గం విశ్వసిస్తున్నా మని వెంకటేశ్వర్లుపేర్కొన్నారు.

తమ సామాజిక వర్గానికి తిరిగి ప్రాతినిధ్యం కల్పించడంద్వారా రానున్న2024అసెంబ్లీఎన్నికల్లో వైకాపా తిరిగిఅధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగాజగన్ మరలా అధికారంలోకి రావడానికి దోహద పడతామని వెంకటేశ్వర్లు అన్నారు.

Related posts

ప్రజల మనిషి సీతక్కను అరెస్టు చేయడం దుర్మార్గం

Satyam NEWS

రేపు ముంబాయికి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

Satyam NEWS

మంచినీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

Satyam NEWS

Leave a Comment