30.7 C
Hyderabad
April 29, 2024 05: 53 AM
Slider ప్రత్యేకం

జగన్ క్యాబినెట్: మళ్లీ మారిన సమీకరణాలు

#YSJaganmohanReddy

పాత మంత్రులందరికి ఉద్వాసన చెబుతామనుకున్న జగన్ ప్లాన్ బెడిసి కొట్టినట్లుగా కనిపిస్తున్నది. ఇంత కాలం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సీనియర్లు అలకపాన్పు ఎక్కడంతో ఉన్న మంత్రుల్లో మళ్లీ ఎక్కువ మందిని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందరిని తీసేసి కొత్త వారిని తీసుకుందామనుకున్న జగన్ ప్లాన్ కు సీనియర్లు అడ్డుతగులుతున్నట్లు స్పష్టం కావడంతో ఇప్పటి వరకూ మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న కొత్త వారికి నిరాశ ఎదురయ్యే పరిస్థితులు ఏర్పాడ్డాయి. తాజా లెక్కల ప్రకారం బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్, జయరామ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్ లను మంత్రి వర్గంలో కొనసాగించేందుకు జగన్ అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఇదే జరిగితే నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు పదవి యోగం లేనట్లే కనిపిస్తున్నది. ఇంత కాలం ప్రభుత్వంలో ఉన్న తమను ఒక్క సారిగా తీసేస్తే పరువు పోతుందని సీనియర్లు భావిస్తున్నారు.

Related posts

8 నుంచి 16 వరకూ తెలంగాణ లో స్కూళ్లు మూసివేత

Satyam NEWS

అర్చక సమాఖ్య కన్వీనర్ గంగు భానుమూర్తి మృతికి సంతాపం

Satyam NEWS

సాయం చేస్తూ అంకితభావంతో ముందుకు సాగుదాం

Satyam NEWS

Leave a Comment