29.7 C
Hyderabad
May 6, 2024 03: 19 AM
Slider విజయనగరం

విజయనగరం  జిల్లా అదనపు ఎస్పీగా అస్మా ఫర్హీన్

#asma

కృష్ణా జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా పని చేస్తున్న  అస్మా ఫర్హీన్ ను విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) గా నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  హరీష్ కుమార్ గుప్తా  ఉత్తర్వులు జారీ చేశారు. సెబ్ అదనపు ఎస్పీ గా అదనపు బాధ్యతలు నిర్వహించవలసిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో సెబీ అదనపు ఎస్పీగా కృష్ణా జిల్లా నుండి అటాచ్మెంట్ పై ఆమె పని చేస్తున్నారు.

2012లో పోలీసుశాఖ లో డైరెక్ట్ డిఎస్పీ గా ఎంపికైన  అస్మా ఫర్హీన్  రాజమండ్రి, విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో డిఎస్పీ హోదాలో పని చేశారు. అదనపు ఎస్పీగా ఉద్యోగ ఉన్నతిని పొంది కృష్ణా, విజయనగరం జిల్లాల్లో సెబ్ అదనపు ఎస్పీగా సమర్థవంతంగా పని చేసి, మద్యం అక్రమ రవాణకు కళ్లెం వేయడంతో పాటు, విద్యార్థులు, ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు

Related posts

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Satyam NEWS

రఘురామ అరెస్టుకు తెలంగాణ బిజెపి ఖండన

Satyam NEWS

ఆర్భాటం చేశారు కానీ ధాన్యం అంతా కొనలేదు

Satyam NEWS

Leave a Comment