33.2 C
Hyderabad
May 15, 2024 19: 29 PM
Slider ఆదిలాబాద్

ఆర్భాటం చేశారు కానీ ధాన్యం అంతా కొనలేదు

#Paddy procrurment

నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలలోని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరి ధాన్యం 35 శాతం మాత్రమే కొన్నారు.

మరి మిగిలిన 70 శాతం వరి కొనుగోలు అలాగే ఉందని, ప్రతినిత్యం కూడా కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి రైతులు రాత్రింబగళ్లూ ఉంటున్నారని నిద్రాహారాలు మానేసి ధాన్యం కొనుగోలు జరుగుతుందో అని వేచి చూసే దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే కాకుండా మొక్కజొన్న కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఇటు జిల్లా అదనపు కలెక్టర్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంవత్సరం వర్షాలు తొందరగా రావడంతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటంతా తడిసి ముద్దయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొన్ని మండలాల్లో ఈ పరిస్థితిని పరిశీలించడంతో అధికార పక్ష నాయకులు వారిని ఆడిపోసుకుంటున్నారు తప్ప రైతుల సమస్యలు పరిష్కరించలేదు.

ప్రభుత్వం చేసిన తప్పులను ప్రతిపక్షాలు ఎత్తి చూపడం తో ఏమి సమాధానం చెప్పలేక కొంతమంది నాయకులు అయితే ఇటు మీడియా పైన, ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు.

Related posts

కామెడీ స్టేషన్స్: నవ్వుకోవాలంటే ఈ పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి

Satyam NEWS

రామతీర్థం లో వైభవోపేతంగా వైకుంఠ ద్వార దర్శనం

Satyam NEWS

ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపిన కొలన్‌ శంకర్‌రెడ్డి

Satyam NEWS

Leave a Comment