28.7 C
Hyderabad
May 6, 2024 10: 35 AM
Slider నల్గొండ

విఆర్ఎ లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

#VRAs

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో విఆర్ఎ సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(విఆర్ఎ)సుమారు 24 వేల మంది ఉన్నారని, ప్రభుత్వ రెవిన్యూ వ్యవస్థలో క్రింది స్థాయి ఉద్యోగులుగా ఉంటూ ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, వీరిలో నూటికి 90 శాతం సామాజికంగా,ఆర్థికంగా, వెనుకబడిన దళిత కుటుంబాలకు చెందిన వారే అధికంగా ఉన్నారని,2020 సెప్టెంబర్ 9న, శాసనసభలో నూతన రెవెన్యూ చట్టం తీసుకున్న సందర్భంగా విఆర్ఎ లు అందరికీ పేస్కేలు ఇస్తామని, వారసులకు తండ్రుల స్థానంలో పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని నిండు చట్ట సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేస్తారని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని, ఉద్యోగులకు వచ్చిన విధంగా సౌకర్యాలు వస్తాయని, గడిచిన పది నెలలుగా విఆర్ఎ లు ఎంతో ఆశతో ఎదురు చూస్తే పేస్కేలు,వారసులకు ఉద్యోగులు ఇవ్వకుండా పి ఆర్ సి  సిఫార్సు చేసిన 19,000 రూపాయలు వేతనం అమలు చేయకుండా 10,500 రూపాయల వేతనం పై 30 శాతం పెంచుతూ సర్కులర్ ఇవ్వటం అన్యాయమని,చట్ట సభలో ఇచ్చిన హామీ మేరకు విఆర్ఎ లను ఆదుకోవాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

డిమాండ్స్

1.55 సంవత్సరాల వయసు పైబడిన విఆర్ఎ లు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.

2.శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పేస్కేలు అమలు చేయాలి.

3.విఆర్ఎ కు వారి స్వంత గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.

4.పి ఆర్ సి కమిటీ సిఫారసు మేరకు కనీస వేతనం 19,000 పెంచి దీనిపై 30 శాతం ఇవ్వాలి.

5.అర్హత కలిగిన విఆర్ఎ లకు ప్రమోషన్లు ఇవ్వాలి.

6. ప్రతి నెలా 1వ,తేదీన వేతనం ఇవ్వాలి.

7.కరోనాతో మరణించిన విఆర్ఎ లకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.

8. మరణించిన విఆర్ఎ లు దహన సంస్కారాల ఖర్చు ఉద్యోగుల మాదిరిగా 20,000 ఇవ్వాలి.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రైవేటు ల్యాబ్ లను తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

Satyam NEWS

వేణుగోపాలాచారికి బండారి శుభాకాంక్షలు

Bhavani

రాజకీయ జోక్యం ఎక్కువైతే పంచాయితీలు ఇంతే సంగతులు….

Satyam NEWS

Leave a Comment