23.7 C
Hyderabad
May 8, 2024 06: 44 AM
Slider పశ్చిమగోదావరి

రాజకీయ జోక్యం ఎక్కువైతే పంచాయితీలు ఇంతే సంగతులు….

#pedavegi panchayati

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్, కార్యదర్శి మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న కోల్డ్ వార్ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. గ్రామం లో సచివాలయ భవనాల లో ఒక భవనం సర్పంచ్ నిర్మిస్తున్నారని మరో రెండు భవనాలు సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి నిర్మిస్తున్నారు.

అయితే రెండు భవనాలు నిర్మిస్తున్న వ్యక్తికి బిల్లు చెల్లించడానికి పంచాయతీ కార్యదర్శి చెక్ ను నిర్మాణదారుని పేరు మీద రాసారు. ఆ చెక్ పై పంచాయతీ సర్పంచ్ సంతకం తప్పని సరిగా ఉండాలి.

చెక్ పై సంతకం పెట్టమని కార్యదర్శి వెళ్లారని నేను నిర్మిస్తున్న భవనానికి బిల్లు వచ్చాకే ఆ చెక్ పై సంతకం పెడతానని పేచీ పెట్టినట్టు తెలిసింది. తప్పనిసరి పరిస్థితులలో చెక్ పై అర్థం కాకుండా సంతకం పెట్టారని, తీరా బాంక్ లో చెక్ పై సంతకం సక్రమంగా లేక చెక్ చెల్లలేదని తెలిసింది.

దీంతో కార్యదర్శి ఆ చెక్ ను రద్దు చేసి మరో చెక్ రాసిచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా సర్పంచ్ తనయుడు పంచాయతీ కార్య కలాపాలలో తలదూర్చుతూ కార్యదర్శిపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిసింది.

తల్లి పరిపాలనలో తనయుడు కలగజేసుకుంటున్న పరిస్థితి కార్యదర్శికి పరిపాలనలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ప్రతి దానికీ సర్పంచి కి బదులు సర్పంచ్ తనయుడు కలగజేసుకోవడం చీటికీ మాటికి గొడవలు పెట్టుకోవడం తలనొప్పిగా మారడం తో కార్యదర్శి సర్పంచ్ తనయుడుపై శనివారం పెదవేగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. కార్యదర్శి ఫిర్యాదుపై పెడవేగి పోలీసులు సర్పంచ్ తనయుడుని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారిస్తున్నామని ఎస్ ఐ సుధీర్ తెలిపారు.

Related posts

అకాల వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు

Satyam NEWS

‘‘అశ్లీల సిఐ’’ ని కాపాడుతున్న గుంటూరు పోలీసు పెద్దలు

Satyam NEWS

Leave a Comment