ఏటీఎం బాక్స్‌లో నగదు దొంగిలించేందుకు విఫయత్నం చేసిన దొంగలు మంటలు రావడం తో పలాయనం చిత్తగించారు.ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం తో అక్కడే తెచ్చిన సామగ్రి వదిలేసి వెళ్లిపోయిన ఘటన అనంతపురం జిల్లా పెనుగొండ కేంద్రంలో జరిగింది.పట్టణంలో ఏక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఈ తెల్లవారు జామున ముఖానికి ముసుగు వేసుకున్నఏటీఎం కేంద్రంలోకి వచ్చిన ఓ దొంగ ఏటీఎం పైకి ఎక్కి సీసీ కెమెరాను ఒక గుడ్డతో కప్పేశాడు.
అనంతరం ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం గ్యాస్ కట్టర్ కూడా ఉపయోగించాడు. ఈ ప్రయత్నంలో ఏటీఎం ధ్వంసమైనా నగదు ఉన్న బాక్స్‌లు ఓపెన్ కాలేదు. పైగా గ్యాస్ కట్టర్ ఉపయోగించడం వల్ల ఏటీఎంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి.దీంతో భయాందోళనకు గురైన దొంగలు ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు దర్యాప్తు ప్రారంభించారు.