28.7 C
Hyderabad
April 28, 2024 10: 54 AM
Slider కవి ప్రపంచం

పొంగే సంబరం

#GandetiVenkataramanaSankranti

పట్నం పనికి సెలవునిచ్చి

సొంతూరికి దారిచూపుతుంటే

మూడు రోజుల ముచ్చట

మూడు కాలాలకోసారి

మురిపెంగా కాళిడేవేళ

అనురాగం గాలిపటమై

అంబరపు అంచుల్ని తాకగా

పవిత్రత గొబ్బమ్మ రూపమై

స్వచ్ఛ రాగమాలపించగా

జీవితం రంగవల్లిగా మారి

నవ క్రాంతిని స్వాగతించగా

పొలం  అలిసిన హలానికి

విశ్రాంతిని అరువుగా ఇచ్చి

పంటను ఇంటి గుమ్మానికి

పరవశంగా పంపించేవేళ

అందాన్ని అద్దుకున్న పల్లె

చలిని చంకనబెట్టుకుని

ఉత్సవాన్ని తలకెత్తుకుని

గడప గడపనా ఉరకలేస్తూ

పొంగిపోయే సంబరం సంక్రాంతి !

గుండేటి రమణ 9949377287

Related posts

కేసీఆర్‌, కేటిఆర్ తో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భేటీ

Satyam NEWS

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యంపై నారాయణకు పిహెచ్ డి

Satyam NEWS

Leave a Comment