36.2 C
Hyderabad
May 12, 2024 17: 10 PM
Slider మహబూబ్ నగర్

మహిళలపై పెట్రేగి పోతున్న దాడులను అరికట్టాలి

#aituc

రాష్ట్రంలో దళితులపై మహిళలపై చిన్నారులపై  పెట్రేగిపోతున్న దాడులను అత్యాచారాలను అరికట్టాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భారత్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఎండ్ల బెట్లలో వినాయకుని విగ్రహం దగ్గర మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు  నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని వినాయకుని పాదాలకు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని నిర్భయ చట్టంతో యాసిడ్ దాడులు లైంగిక దాడులు వేధింపులకు పాల్పడడంలాంటి నేరాల్లో శిక్షలు కఠినతరం అయిన జైలు శిక్షలు పెంచడంతోపాటు మరణ శిక్ష పడేలా చట్టాలు ఉన్నా మహిళలలపై జరిగే అత్యాచారాలను నిరోధించ లేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ తమపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయడంలో న్యాయం పొందటంలో మహిళలు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొన్ని సహస్రాబ్దాలుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చిన ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు మధ్యయుగంలో ఆధమస్థాయికి  అణఛబడటం అనేక సంఘసంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేశారని తెలిపారు.

ఇటీవల ఆరేళ్ల పసిపాపపై  అత్యాచారం చేసిన ఘటన మనం చూశామని దళితులు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయని చట్టరీత్యా అందరూ సమానులే రాజ్యాంగం చెబుతోందని ఆచరణలో మాత్రం దళితులను కించపరుస్తూన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కండిషన్స్అప్లై: ఆ రెండు షరతులు ఒప్పుకుంటేనే

Satyam NEWS

నేటి నుంచే మేడారం మహా జాతర

Satyam NEWS

తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే

Bhavani

Leave a Comment