23.2 C
Hyderabad
May 8, 2024 00: 24 AM
Slider ప్రపంచం

కండిషన్స్అప్లై: ఆ రెండు షరతులు ఒప్పుకుంటేనే

iran proposes two condoition to america for discuss

అమెరికాతో శాంతి చర్చలు జరిపాలంటే తాము ప్రతిపాదించిన రెండు షరతులకు అంగీకరించాలని ఇరాన్‌ తాజాగా ఒక ప్రతిపాదన తయారు చేసింది.తమ దేశంపై విధించిన వివిధ ఆంక్షలను ఎత్తవేయడం మొదటిది కాగా ,2015లో కుదిరిన అణుఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా తిరిగి ఒప్పందంలో భాగస్వామి కావడం రెండవది.ఈ రెండు చర్యలు అమెరికా తీసుకుంటే తాము చర్చలకు సిద్ధమేనని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహని విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు.

తమ దేశంపై అమెరికా ఇప్పటికీ ఆంక్షల ఒత్తిడి చేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత సాధన అత్యంత ముఖ్యమైనదని ఆయన అన్నారు. పశ్చిమాసియాలోనూ, పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ సహాయం లేకుండా శాంతి సుస్థిరత అసాధ్యమని రౌహని హెచ్చరించారు. తాము ఏనాడు అణ్వాయుధాలను కోరుకోలేదని ఆయన అన్నారు.

Related posts

శ్రమజీవుల చెమట చుక్కలే అభివృద్ధికి ఆలంబన

Satyam NEWS

ఎమ్మెల్సీ అశోక్ బాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన చంద్రబాబు

Satyam NEWS

కొండగట్టులో కేసీఆర్ కుటుంబం భూముల దందా…!

Satyam NEWS

1 comment

Mba rao February 27, 2020 at 4:56 PM

Sentiment sir

Reply

Leave a Comment