33.7 C
Hyderabad
April 30, 2024 00: 04 AM
Slider ముఖ్యంశాలు

ప్రైవేట్ పార్టులపై కారం కొట్టి.. వివస్త్రను చేసి.. దళిత మహిళపై దాడి

#dalit

కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

కామారెడ్డి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళను, ఆమెతో ఉన్న వ్యక్తిని వివస్త్రను చేసి ప్రైవేటు పార్టులపై కారం కొట్టి దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన నాలుగైదు రోజులకు బయటకు పొక్కింది. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అదే గ్రామానికి చెందిన సంధ్యను పెళ్లి చేసుకుని కొన్ని నెలల తర్వాత విడాకులు ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం నరేష్ కూలి పనులు చేసుకునేందుకు రామారెడ్డి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ లో పనికి చేరాడు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన దళిత యువతి స్రవంతితో కలిసి సహజీవనం చేస్తున్నాడు. నరేష్ భార్య సంధ్య నరేష్ కోసం ఆరా తీయగా రామారెడ్డి మండల కేంద్రంలో ఉంటున్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసిన సమయంలో ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు. దీంతో ఆగ్రహం చెందిన నరేష్ భార్య సంధ్య, బంధువులు నరేష్, స్రవంతిలను వివస్ర్తలు చేసి చితకబాదారు. అలాగే కారం పొడి చల్లుతూ దాడికి పాల్పడ్డారు. అనంతరం నరేష్ ను స్వగ్రామమైన మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి తీసుకెళ్లి బంధించారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ప్రాణాలతో ఉంచమని బెదిరించారు. ఈ సంఘటన జరిగి 7 రోజులు అయిన బయటకు రాలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో బాధితులు నరేష్, స్రవంతిలు రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల అదుపులో దాడికి పాల్పడిన వ్యక్తులు

అయితే ఈ ఘటనపై ఆలస్యంగా ఫిర్యాదు రావడంతో రంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు తమపై దాడికి పాల్పడిన వారి పేర్లు ఫిర్యాదులో పేర్కొనగా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారని ఎస్పీ సిందూశర్మ తెలిపారు. ఘటన జరిగి నాలుగైదు రోజులు గడిచినా పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని విలేకరులు ప్రశ్నించగా బాధితురాలు ఫిర్యాదు నిన్ననే ఇచ్చిందని, ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందని బాదితురాలు పేర్కొనలేదని, అలాంటిదేమైన ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని ఎస్సై, ఎస్టీ యాక్టు ప్రకారం రిమాండుకు తరలిస్తామన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

పోలీసు బాస్ ఆదేశాలతో “స్పందన” తీసుకున్న ఏఎస్పీ…!

Satyam NEWS

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం

Satyam NEWS

గూగుల్ పై జరిమానాను సమర్థించిన సెకండ్ కోర్టు

Satyam NEWS

Leave a Comment