Slider విజయనగరం

పోలీసు బాస్ ఆదేశాలతో “స్పందన” తీసుకున్న ఏఎస్పీ…!

#spandana

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు “స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ  ఎం. దీపిక ఆదేశాలతో అదనపు ఎస్పీ అస్మా ఫర్హాన్  నిర్వహించారు. సామాన్య ప్రజల నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, చట్ట పరిధిలో ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ 38 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

బొండపల్లి మండలం రుద్రపాలెంకు చెందిన ఒక వ్యక్తి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు 1983లో ప్రభుత్వం చినతామరపల్లి గ్రామంలో ఇంటి పట్టా మంజూరు చేయగా, సదరు స్థలంలో తాను ఇల్లు నిర్మించుకున్నట్లు, తన సోదరుడు మరణించిన తరువాత అతని కుటుంబ సభ్యులు నిర్మించుకున్న ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు అన్ని రకాల పత్రాలు కలవని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, డాక్యుమెంట్లును పరిశీలించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను జానపద గాయకుడుగా పాటలు పాడుతుంటానని, తనను లక్ష్యంగా చేసుకొని, కొంతమంది వ్యక్తులు తనను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో వీడియో, మెసేజ్లు పెట్టి, వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

విజయనగరం  కాళిఘాట్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటిని నెల్లిమర్ల మండలం తమ్మాపురంకు చెందిన వ్యక్తికి అమ్మినట్లు, సదరు వ్యక్తి రిజిస్ట్రేషను చేయించుకున్నప్పటికీ, ఇంకనూ బకాయి పడిన 2.10 లక్షలు చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం వన్ టౌన్ సీఐను ఆదేశించారు.

జామి మండలం సంతపేటకు చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాది చేస్తూ తాను జామి  కి చెందిన వ్యక్తి వద్ద చిట్టీలు నిమిత్తం డబ్బులు చెల్లించినట్లు, చిట్టీలు పూర్తయినప్పటికీ, తనకు చిట్టీలు ద్వారా రావాల్సిన  20 లక్షలను ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని జామి ఎస్ఐను ఆదేశించారు.

భోగాపురం మండలం గుడివాడ కి చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి వారి అవసరాల నిమిత్తం 2 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు, సదరు వ్యక్తి ఇప్పుడు తన డబ్బులను తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని భోగాపురం సీఐను ఆదేశించారు.

గంట్యాడ మండలం పెదమజ్జిపాలెంకు చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బొండపల్లి మండలంకు చెందిన కొంతమంది వ్యక్తులు తన ఇంటిని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, దౌర్జన్యంకు పాల్పడుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సీఐను ఆదేశించారు.

ఇలా “స్పందన”లో స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ కి నివేదించాలని అధికారులను అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ జె. మురళి, ఎస్బీ సీఐ జి.రాంబాబు, డీసీఆర్బీ ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఫోర్ కాస్ట్: తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన

Satyam NEWS

ఆన్లైన్ ట్రేడింగ్ గొడవ.. ఇద్దరు కిడ్నాప్

Satyam NEWS

కమ్మ సామాజిక వర్గ సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment