33.7 C
Hyderabad
April 30, 2024 00: 04 AM
Slider నిజామాబాద్

అంతర్ జిల్లా బైక్ దొంగల అరెస్ట్

#sindhusharmaips

పలు జిల్లాల్లో బైకులు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా బైకు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 లక్షల విలువ చేసే 29 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిందూశర్మ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైకు దొంగతనాలకు సంబంధించి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు ఎస్పీ తెలిపారు. అందులో భాగంగా నిన్న జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేపడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా బైకుపై రావడంతో బైక్ సంబంధించిన పత్రాలను చూపించమనగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారన్నారు.

వారిని పట్టుకుని విచారించగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో 29 బైకుల చోరీకి పాల్పడినట్టు విచారణలో తేలిందని పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బొంకన్ పల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నిజాంపూర్ శశాంక్(19), అదే గ్రామానికి చెందిన రోజుకూలి ఎరుగట్ల సందీప్(26), మాక్లూర్ కు చెందిన సెంట్రింగ్ వర్కర్ షేక్ అహ్మద్(28) ఉన్నారు. బైకు చోరీలకు సంబంధించి మిస్సింగ్ కేసులు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో 12 కేసులు, బాన్సువాడలో 4, నస్రుళ్లబాద్ లో 1, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ పరిధిలో 2, వేల్పూర్ 2, మోర్తాడ్ 1, ఇందల్వాయి 1, నిజామాబాద్ 4 వ టౌన్ లో 2, ఆర్మూర్ 1, కమ్మర్ పల్లి 1, నిర్మల్ జిల్లాలోని నిర్మల్ 1, భైంసాలో 1 చొప్పున కేసులు నమోదైనట్టు తెలిపారు. వీరినుంచి 40 లక్షల విలువ చేసే 29 బైకులు స్వాధీనం చేసుకోగా అందులో 12 బులెట్, 12 పల్సర్, 1 యాక్టివా, 1 గ్లామర్, 1 హెచ్.ఎఫ్ డీలక్స్, 1 splendor, 1 టివిఎస్ స్టార్ సిటీ బైకులు ఉన్నట్టు తెలిపారు.

ప్రజలు ఎవరివైన బైకులు మిస్సయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. బైకులు కొనేటప్పుడు ఎలాంటి పత్రాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారని, కొన్ని బైకులు ఇద్దరుముగ్గురు వ్యక్తుల చేతులు మారుతున్నాయని, ఇవి ప్రమాదకరమని తెలిపారు. బైకు దొంగల పట్టివేతలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ప్రకాష్, పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సీసీఎస్, ఎస్బి పోలీసులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?

Sub Editor

ఢిల్లీ డెసిషన్: ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదు

Satyam NEWS

సంజనా, రాగిణిలకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment