24.7 C
Hyderabad
March 26, 2025 09: 44 AM
Slider హైదరాబాద్

ఎటాక్: పోలీస్ స్టేషన్ ను బాంబు పెట్టి పేలుస్తా

#Longarhouse Police

ఇతను ఎవరో పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ లాక్ డౌన్ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులపై తిరగబడ్డాడు. రాయలేని బూతులతో పోలీసులపై విరుచుకుపడ్డాడు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్  పోలీస్ స్టేషన్ పరిధిలోని టిప్పు ఖాన్ ఫుల్ బ్రిడ్జి వద్ద నేడు ఈ సంఘటన జరిగింది.

అక్కడ లాక్ డౌన్ సందర్భంగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. రోడ్డుపై వాహనాలు తిరగడం నిషేధించిన విషయం తెలిసిందే. అదీ కూడా మాస్క్ లేకుండా ఇతను వెళుతున్నాడు. నెత్తిపై హెల్మెట్ కూడా లేదు. విధినిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ ఇతడిని ఆపాడు. మోటార్ సైకిల్ ఆగగానే బండికి ఉన్న తాళం చెవి తీసుకున్నాడు.

అంతే ఏమీ మాట్లాడను కూడా మాట్లాడలేదు. అయితే బండి ఆపిన క్షణం నుంచి ఇతను పోలీసులను తిడుతూనే ఉన్నాడు. బాంబు పెట్టి పోలీస్ స్టేషన్ ను పేల్చేస్తానని అసభ్య పదజాలంతో తిట్టాడు. పోలీసులు వీడియో తీశారు. అతడిని ఏమీ అనలేదు. మోటర్ సైకిల్ దిగిన అతను పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశాడు కూడా. పోలీసు కానిస్టేబుల్ కట్టుకున్న మాస్క్ ను కూడా లాగేశాడు. లాక్ డౌన్ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు కొడుతున్నారని గొడవ చేసేవారు  ఇలాంటి వాళ్లను ఏం చేయాలో చెబితే బాగుంటుంది.

Related posts

పట్టాలున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

Satyam NEWS

కరోనా హెల్ప్: బిజెపి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS

కాకినాడ కలెక్టరేట్ వద్ద మాజీ సైనికుడు ఆమరణ నిరాహార దీక్ష

Satyam NEWS

Leave a Comment