42.2 C
Hyderabad
May 3, 2024 15: 54 PM
Slider వరంగల్

జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులు అప్రజాస్వామికం

#journalists

అవినీతి, అక్రమాలను, దౌర్జన్యాలను ప్రేరేపిస్తూ పలుకుబడి పేరుతో అణిచివేస్తున్న వ్యక్తుల, వ్యవస్థల, అధికారుల నైజాన్ని ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించి మానసిక, భయబ్రాంతులకు గురి చేయడం అప్రజాస్వామికమని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సంద బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ గంజి రఘు పట్ల జరిగిన సంఘటన ప్రత్యక్ష

సాక్ష్యాధారమని అన్నారు. జర్నలిస్టు రఘు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులను అణచి వేస్తే ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని ఆయన ప్రశ్నించారు. నిజాలను వెలికి తీస్తున్న జర్నలిస్టులపై మౌఖిక, భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్య నాలుగో స్తంభాన్ని ఖూనీ చేయడంలో ఒక భాగమేనని విమర్శించారు. 

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని  జర్నలిస్టుల పక్షాన నిలబడాలన్నా రు. జర్నలిస్టులపై జరుగుతున్న సంఘటనలపై మేధావులు, బుద్ధిజీవులు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, సాహితీవేత్తలు, సామాజిక నిపుణులు ముక్తకంఠంతో ప్రశ్నించి, ప్రభుత్వాలు కళ్లు తెరిచేలా చేసి జర్నలిజాన్ని కాపాడడంలో ముందుండాలని సంద బాబు కోరారు.

Related posts

తాగిన మత్తులో మాట్లాడుతున్న మంత్రి నాని

Satyam NEWS

(CVS) Thc Free Cbd Oil Tru Hemp Cbd Oil Vermont Cbd Hemp Oil Sda

Bhavani

బ్లాస్టింగ్ డెత్:గ్యాస్‌ తయారీ పరిశ్రమలో పేలుడు 5గురు మృతి

Satyam NEWS

Leave a Comment