37.2 C
Hyderabad
April 26, 2024 20: 48 PM
Slider పశ్చిమగోదావరి

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

#amul

పశు గ్రాసంతో పాటు మల్టీ మినరల్ పిండి పదార్ధాలను కూడా పశువులకు అందించి పాడి రైతులు పాల దిగుబడిని పెంచుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ నెహ్రు బాబు అన్నారు.

పెదవేగి మండలం కె కన్నాపురం గ్రామం లో మంగళ వారం గ్రామ సర్పంచ్ ఈడ్పుగంటి రమేష్ బాబు ఆధ్వర్యం లో ఉచిత పశువైద్య శిబిరం  జరిగింది. ఈ శిబిరం లో నెహ్రు బాబు పాల్గొని పాడి పరిశ్రమ ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ  పధకం పాడి రైతుల అభివృధ్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని చెప్పారు.

ప్రతి పాడిరైతు  పాల దిగుబడి పెంచే  సీజనల్  పశుగ్రాసాలను పశువులకు అందించాలని వెటర్నరీ ఉప సంచాలకులు కె శ్రీనివాసరావు రైతులకు తెలిపారు.

ఈ వైద్య శిబిరం లో సుమారు 40 పశువులకు పరీక్షలు చేసి మందులను, మినరల్ మిక్సర్ పశు దాణాను  పంపినిచేసామని పెదవేగి మండల పశు వైద్యాధికారి తారకేశ్వరరావు తెలిపారు.

Related posts

స్వీయ నిర్బంధమే కరోనా కు నివారణకు మార్గం

Satyam NEWS

అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భేటీ

Satyam NEWS

మరింత పటిష్టంగా ఐసోలేషన్ వార్డుల నిర్వహణ

Satyam NEWS

Leave a Comment