32.2 C
Hyderabad
May 9, 2024 13: 07 PM
Slider విజయనగరం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు చేపట్టాలి

#crimereviewmeeting

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ జిల్లాలో టాప్ 10 పోలీసు స్టేషను పరిధిలో జరుగుతున్న ప్రమాదాలను, ప్రమాదాలను నియంత్రణకు సంబంధిత పోలీసు అధికారులు చేపట్టిన చర్యలను జిల్లా ఎస్పీ సమీక్షించారు. కర్మాగారాలు, స్కూల్స్, కళాశాలలు ఉండే ప్రాంతాల వద్ద, జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే ప్రాంతాల వద్ద ప్రమాదాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

రిఫర్ కేసుల్లో ఫిర్యాదుదారులకు నోటీసులు అమలు చేసి, కోర్టుల్లో ఫైనల్ రిపోర్టులను దాఖలు చేసి, కోర్టుల నుండి ఆర్.సి. నంబర్లు తీసుకోవాలన్నారు. దర్యాప్తు పెండింగులో ఉన్న కేసుల్లో దర్యాప్తును త్వరితతిన పూర్తి చేయాలని, సంబంధిత మెడికల్ ఆఫీసర్స్, ఇతర అధికారుల నుండి ధృవ పత్రాలను పొందాలన్నారు.

లోక్ అదాలత్లో కేసులు ఎక్కువగా డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సైబరు నేరాలు, నకిలీ లోను యాప్ల మోసాలు గురించి ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే విధంగా మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు. సైబరు మోసగాళ్ళ ఆగడాళ్ళకు కళ్ళెం వేయాలని, ఏదైనా నేరం జరిగిన వెంటనే సకాలంలో 1930కు ఫిర్యాదు లన్నారు. హిస్టరీ షీట్లు కలిగిన యువకులు, చురుకైన వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

అసాంఘిక శక్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘటనల పట్ల ముందస్తు సమాచారం సేకరించే విధంగా ఎం.ఎస్.పి.ల సేవలను వినియోగించుకోవాలన్నారు. గత మాసంలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

సెప్టెంబరు మాసాంతరంకుగాను (1) మూడు గ్రేవ్ ఆస్తి దొంగతనాలను చేధించుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎఫ్.పి.బి. ఎస్ఐ బి. మురళి మోహనరావుకు “బెస్ట్ పెర్ఫామర్ అవార్డు” ను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రధానం చేసారు.

(2) రాజాం పిఎస్ పరిధిలో రెండు గ్రేవ్ కేసులను చేధించుటలో క్రియాశీలకంగా పని చేసిన ఇన్స్పెక్టరు కే.రవికుమార్ (3) కానిస్టేబుళ్ళు వి. వెంకట రమణ (4) షేక్ హస్సీన్ (5) పి.శ్రీనివాసరావు

(6) బొబ్బిలి పిఎస్ పరిధిలో మూడు దొంగతనం కేసులను చేధించుటలోను క్రియాశీలకంగా పని చేసిన ఎస్ఐ వి. జ్ఞాన ప్రసాద్ (7) సంతకవిడి పిఎస్ పరిధిలో 7 నాన్ బెయిలబుల్ వారంట్లును ఎగ్జిక్యూట్ చేసిన ఎఎస్ఐ కే. అడివన్న (8) కొత్తవలస పిఎస్ పరిధిలో ఆస్తికి సంబంధించిన నేరాలను చేధించుటలో దర్యాప్తు అధికారులకు సహకారాన్ని అందించిన ఎ.శ్రీనివాసరావు

(9) విజయనగరం 2వ పట్టణ పిఎస్ పరిధిలో గంజాయి విక్రయదారులను అరెస్టు చేయుటలో క్రియాశీలకం సమాచారం సేకరించిన ఎఎస్ఐ బి. గౌరి నాయుడు (10) కానిస్టేబులు ఆర్.నారాయణ రావు (11) దిశ మహిళ పిఎస్ లో పని చేస్తూ 23 నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసిన హెచ్సీ డి. రాజశేఖర నాయుడులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రధానంచేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎస్ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీ రావు, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు వై పరశురాం, డిపిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జే. మురళి, బి. వెంకటరావు, సిహెచ్. రుద్రశేఖర్, సిహెచ్. లక్ష్మణరావు, ఎస్. కాంతారావు, జయనాధ్, జి. సంజీవరావు, ఎం. నాగేశ్వరరావు, ఎస్. తిరుమలరావు, కే. రవి కుమార్, సింహాద్రి నాయుడు, ఎల్.అప్పలనాయుడు, టి.వి. తిరుపతిరావు, డిపిఓ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు మరియు వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎం భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

వరి పొలంలో కలుపు తీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ర‌క్షించాల్సిన క‌న్న తండ్రే…కాల‌య‌ముడ‌య్యాడు…

Satyam NEWS

కరోనా:చిల్కూర్ బాలాజీ టెంపుల్లో ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment