32.7 C
Hyderabad
April 26, 2024 23: 47 PM
Slider విజయనగరం

ర‌క్షించాల్సిన క‌న్న తండ్రే…కాల‌య‌ముడ‌య్యాడు…

#vijayanagaram police

కొడుకు పుడితే పున్నామి నర‌కం నుంచీ త‌ప్పిస్తాడంటారు…కూతురు పుడితే మ‌హాల‌క్ష్మీ పుట్టిందంటారు. ఇలా క‌డుపున పుట్టిన బిడ్డ‌ల‌ను ఆస్తి ప‌రంగా కాకుండా..సంప్ర‌దాయాల‌తో జ‌న్మించార‌ని అనుకున్న క‌న్న‌వారు ఉన్న ఈ గ‌డ్డ‌పై   అందుకు విరుద్దంగా అక్క‌డ‌క్క‌డ పైకి తెలియ‌కుండానే కొన్ని కొన్ని దారుణాలు, ఘోరాలు జ‌రుగుతున్నాయి.

అప్పుడ‌ప్పుడు ప్ర‌సార‌,ప్ర‌చార మాధ్య‌మాల‌లో త‌ర‌చూ చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మీరు చ‌ద‌వ‌బోయే వార్త మాత్రం మిమ్మ‌ల్ని కంట త‌డి పెట్ట‌క‌మానదు…వార్త పూర్తిగా చ‌దివిన త‌ర్వాత అలాంటి కొడుకులు ఈ భూమ్మీద ఉన్నారా అని ఆశ్చ‌ర్యం క‌ల‌గక మాన‌దు.

ఇక వివ‌రాల్లోకి వెళితే..అది ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ న‌గ‌రంలోని పోలీస్ బ్యారెక్స్ లో నిర్వ‌హిస్తున్న స్పంద‌న కార్య‌క్ర‌మం. ప్ర‌తీ సోమ‌వారం మాదిరిగానే ఆగ‌స్టు 2 న నిర్వ‌హించిన ఈ స్పంద‌న కార్య‌క్ర‌మంలో స‌రిగ్గా ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు ప్రారంభమైంది.

ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు  జ‌ర‌గ‌కుండా ముందుగానే స్పంద‌న కు వెళ్లే మార్గంలో మెట‌ల్ డిటెక్ట‌ర్ పెట్టి..ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన  వారిని త‌నిఖీ చేసి మ‌రీ పంపిస్తున్నారు..ఏర్ పోలీసులు. మ‌రి కాసేపట్లో ఎస్పీ దీపికా పాటిల్ వ‌స్తున్న స‌మ‌యంలోనే ఏఎస్పీ స‌త్యనారాయణ…ఒక్కోక్కో బాధితును స‌మ‌స్య‌ను అర్జీ రూపంలో తెలుసుకుంటున్నారు.

ఆ స‌మ‌యంలోనే డెంకాడ‌కు చెందిన ఓ త‌ల్లీ.త‌న‌యుడు.త‌మ గోడును ఏఎస్పీ కి చెప్పుకున్నారు. డ్రైవ‌ర్ అయిన కొడుకు గోవింద్..వృద్దాప్యంలో ఉన్న త‌ల్లిని వెంట పెట్టుకుని…మ‌రీ త‌న తండ్రి పెడుతున్న చిత్ర‌హింస‌ల చిట్టా తెలియ చేసారు. ఇద్ద‌రు పిల్ల‌లున్నా.. రెండో పెళ్లి చేసుకుని..తమ తాత‌ల ఆస్తిని కాజేసీ…న‌న్ను..నా కన్న త‌ల్లికి తీవ్ర అన్యాయం చేస్తున్నాడ‌ని ఫిర్యాదు చేస్తూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

గతంలో ఇలానే స్పంద‌న కు వ‌చ్చాన‌ని బాదితుడు గోవింద్ చెప్ప‌డంతో  వెంట‌నే ఏఎస్పీ సత్య‌నారాయ‌ణ స్పందించి  భోగాపురం సీఐ శ్రీధ‌ర్ ద్వారా డెంకాడ ఎస్ఐ కు చెప్పి…స‌ద‌రు బాధితుని  తండ్రి పై  కేసు పెట్టి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల‌ని ఫోన్ లోనే తెలియ చేసారు.

ఇలా స్పంద‌న కు  జిల్లా ఎస్పీ  39 ఫిర్యాదులను స్వీకరించి, ఇచ్చిన ఫిర్యాదులకు రశీదులను అందజేసి, వాటి పరిష్కారానికి త‌గు చర్యలు చేపట్టారు.. ఇందులో భాగంగా…విశాఖపట్నం కు చెందిన మామిడి వరలక్ష్మి ఒక  ఫిర్యాదు ,భోగాపురం మండలం ఎర్రముసిలపాలెం  చెందిన ధనలక్ష్మి జిల్లా ఓ ఫిర్యాదు,  పాచిపెంట మండలం పి.కోనవలస కి చెందిన మీనాకుమారి నుంచీ మ‌రో ఫిర్యాదు అలాగే గరివిడి మండలం కొండపాలెంకు చెందిన సుధాదీప్తి నుంచీ ఇంకో ఫిర్యాదు, ఎస్.కోట మండలం రేవళ్ళపాలెంకు చెందిన గంగునాయుడు  నుంచీ ఇంకొక‌ ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు.

తక్షణం, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పై ఏర‌కంగా  చ‌ర్య‌లు  తీసుకున్నారో  నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి. సత్యన్నారాయణరావు తో పాటు ఓఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, ఎస్ ఐలు నీలకంఠం, కృష్ణవర్మ, సూర్యారావు, విక్రమరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతి అంతం

Satyam NEWS

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS

బేగంపేటలో టిడిపి అభ్యర్ధికి విశేష మద్దతు

Satyam NEWS

Leave a Comment