28.2 C
Hyderabad
May 9, 2024 02: 13 AM
Slider నల్గొండ

మున్సిపల్ సమావేశం తక్షణమే నిర్వహించాలి

#municipal

మున్సిపల్ ముఖ ద్వారం ఎదుట బైటాయించి ఆందోళన చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సమావేశం నిర్వహించక తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు మున్సిపాలిటీ సమావేశం నిర్వహించ లేదని,తక్షణమే మున్సిపాలిటీ సమావేశం నిర్వహించాలని మున్సిపాలిటీ  కార్యాలయం ముఖ ద్వారం ఎదుట కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,రాజా,వరలక్ష్మి నాగరాజు,విజయ వెంకటేశ్వర్లు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ చివరి సమావేశం 2021 డిసెంబర్ 31న, నిర్వహించారని,తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు మున్సిపాలిటీ సమావేశం నిర్వహించలేదని అన్నారు. పలుమార్లు చైర్పర్సన్, కమీషనర్ ల దృష్టికి తీసుకొని వెళ్ళమని,అయినప్పటికీ నియంత పోకడలకు పోయి సమావేశం నిర్వహించక పోవడంతో వార్డులలో సమస్యలు తిష్ట వేశయని,ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైందని అన్నారు. మున్సిపాల్టీలో సమావేశాలు నిర్వహించకుండా ముందస్తు అనుమతుల పేరుతో ఇష్టం వచ్చినట్లు  పనులు చేసినట్లు రికార్డులు రాసుకొని కోట్లాది రూపాయలు గోల్ మాల్ చేశారని వారు ఆరోపించారు.

పట్టణ ప్రగతి పేరుతో ప్రతి నెల 32 లక్షల రూపాయలు వస్తున్నాయని,ఏ పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపాల్టీ లో మున్సిపాలిటీ లే అవుట్ భూములు కొందరు కాజేశారని,ఆ భూములు ఆక్రమించి అమ్ముకున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని,మున్సిపాలిటీ భూముల్ని కాపాడాలని కోరారు. పట్టణంలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా రియల్ వ్యాపారులు ఇష్టానుసారంగా భూములు విక్రయాలు కుంటలలో చేసి అమ్మి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని,మున్సిపాల్టీ అనుమతులు లేకుండా విక్రయాలు జరిపిన ఆ భూములు,రిజిస్టేషన్ లు రద్దు చేయించి ఆ ప్లాట్లలో ఉన్న హద్దుల రాళ్ళని తొలగించాలని డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

హామీ ఇచ్చి ఐదేళ్లయినా అమలు చేయరేం సారూ?

Satyam NEWS

బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ లకు ఎమ్మెల్యే మాగంటి సవాల్

Satyam NEWS

టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్: మంత్రి కెటిఆర్ ని బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment