28.7 C
Hyderabad
May 5, 2024 23: 59 PM
Slider ఖమ్మం

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీపీఆర్ పై అవగాహన

#CPR

గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు, ఊపిరితుత్తులు శ్యాస తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ప్రాణ రక్షణ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన సీపీఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి అన్నారు.

పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లలోని పోలీస్ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో పాటు హోంగార్డ్స్ సిబ్బందికి సీపీఆర్ ఎలా చేయాలనే అంశాలపై వైద్య నిపుణులు వివరించారు.

ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టు కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోవడంతో దీనిపై స్పందించి సీపీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ అందజేయడం జరుగుతోందన్నారు. కార్డియాక్ అరెస్టు కారణంగా పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ శ్యాసకోశ పునరుజ్జీవనం కలిగించవచ్చన్నారు. ప్రస్తుత రోజుల్లో సీపీఆర్ ప్రక్రియ పై తప్పనిసరిగా అవగాహన కలిగివుంచాలన్నారు.

నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఈ సీపీఆర్ ప్రక్రియ తెలియడం ద్వారా కార్డియా అరెస్టుకు గురైన వ్యక్తిని కాపాడ‌డం ద్వారా వారి కుటుంబాని మేలు చేసివాళ్ళము అవుతామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఒకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం వుందన్నారు.

ముఖ్యంగా ఈ పరీక్షల ద్వారా ముందుస్తుగానే వ్యాధులను గుర్తించి తగు చికిత్సను తీసుకోవడం సులభం అవుతుందన్నారు. అలాగే కార్డియాక్ అరెస్టు భారీన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత అలవాట్లలో మార్పు రావాలని, ఆహారపు అలవాట్లకు సంబంధించి నియమ నిబంధనలు పాటించాల్సి వుంటుందని, తప్పనిసరిగా శారీరక వ్యాయామం అవసరమని తెలియజేసారు.

Related posts

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ సందర్భంగా హుజూర్ నగర్ లో జెండా పండుగ

Satyam NEWS

జులై 22న ‘మీలో ఒకడు’ చిత్రం గ్రాండ్  రిలీజ్

Satyam NEWS

Leave a Comment