40.2 C
Hyderabad
April 29, 2024 16: 09 PM
Slider నిజామాబాద్

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

#sucide

గ్రామాల్లో ప్రజలకు కూడా పార్కులు ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అయితే అదే ప్రకృతి వనంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం సంఘమేశ్వర్ గ్రామానికి చెందిన సబిత్ రెడ్డి ఉగ్రవాయి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు బయలుదేరిన సబిత్ రెడ్డి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఓ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.

ఈ విషయం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబిత్ రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.

జీవితంలో చేసిన ఒక తప్పు వల్ల ఇలా ఉన్నాను
-మృతికి ముందు సభిత్ రెడ్డి సూసైడ్ నోట్

అయితే సబిత్ రెడ్డి మృతి చెందకముందు ఓ సూసైడ్ నోట్ రాసాడు. ‘అందరూ నన్ను క్షమించండి. ప్రస్తుతం నేను ఉన్న మానసిక స్థితిలో ఎవరిని ఇబ్బంది పెట్టలేను. అమ్మా.. నాన్న.. మీ కొడుకు ఎంతో గొప్పవాడు అవుతాడని మురిసిపోయేవారు. నేను అందరికి ఆదర్శంగా ఉన్న రోజు నుండి ఇలా ఉండకూడదు అనే విధంగా అయ్యాను. జీవితంలో నేను చేసిన ఒక తప్పు వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. అది సహవాసమా.. శాపమా.. అనేది ఆ దేవుడికి, నాకు తెలుసు. చుట్టాలు, అమ్మానాన్న, నానమ్మ తమ్ముడికి ఎప్పటిలాగే ధైర్యంగా ఉండండి. గ్రామంలోని ప్రతి ఒక యువతకు నేనంటే చాలా ఇష్టం.

మిస్ యూ ఆల్. నేను నాలా ఉండలేకపోతున్న. నేను నా వృత్తిని బాగా చేయగలను కానీ ఇప్పుడు దానిని కూడా చేయలేకపోతున్న. బాబాయ్, పిన్ని(సర్పంచ్) మంచి సర్పంచులు. కోపం తప్ప స్వార్థం లేనివారు. ఈరోజు డీఎస్ఆర్ కొట్టనందుకు కొప్పడకండి ఎంపీఓ సార్. రాయడానికి నాకు చేతులు వణుకుతున్నాయి. చిట్టి తల్లి.. నా జీవితంలో ఒకే ఒక అమ్మాయి అనుకున్నా. నీకు తప్ప నాజీవితంలో ఎవరికి చోటు లేదు. నా గుండెలపై జాతీయ జెండాతో చనిపోతా మేడం అని చిన్నప్పుడు మా జ్యోతి మేడంకి చెప్పాను. నేను చనిపోయాక నా గుండెలపై ఉన్న జాతీయ జెండాను తీసేయండి. అవమానపరచొద్దు. నా శివయ్య నాతో ఉంటాడు. సారీ టు మై సెల్ఫ్. ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి. ఇట్స్ నో మోర్’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

Related posts

వాలంటైన్ గాడ్ని రానివ్వని విశాఖ పోలీసులు

Satyam NEWS

సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి                           

Satyam NEWS

కొప్పరపు కవుల కవితా ప్రశస్తి గ్రంథం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment