39.2 C
Hyderabad
May 3, 2024 13: 43 PM
Slider మహబూబ్ నగర్

ధాన్యం కొనుగోలు పై అలసత్వం వద్దు

#paddy

రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అలసత్వం చేయవద్దని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట లో శుక్రవారం రైతులు కొనుగోలు సెంటర్ల నిర్వహణను అసహనం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాపై స్పందించిన అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోలు పై అలసత్వం వహించరాదని అధికారులను హెచ్చరించారు. ఐకెపి సంస్థలను హమాలీలను సమన్వయం చేయాలని సూచించారు.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆదేశించిన అధికారులు ఐ కె పి సంస్థలు హమాలీల సమన్వయ లోపం వల్ల కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన దిగుతున్నారని, కాంటాలు తగినన్ని లేక, హమాలీలు అందుబాటులో లేకపోవడం పలు కారణాలవల్ల కొనుగోలు ఆగిపోతున్నాయని కాగా ప్రస్తుత తుఫాను సందర్భంగా రైతులను తెచ్చిన పంట వర్షాలకు తడిసి ముద్ద అవుతుందని అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మరిన్ని కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతుల ఆందోళన అర్థం చేసుకొని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గోపాలపేట మండల గ్రామ అఖిలపక్ష ఐక్యవేదిక కమిటీలను కూడా ఎన్నుకున్నామని కమిటీ వివరాలు త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు జానంపేట రాములు ఆర్టిఐ అధ్యక్షుడు కొంకి రమేష్ రమణ భాస్కర్ వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెండో విడత పంపిణీ కి ఏర్పాట్లు

Bhavani

దిశ ఫొటోలు వాడుతున్న మీడియాపై పోలీసు చర్యలు

Satyam NEWS

ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో భారత విద్యార్థులకు పతకాలు

Bhavani

Leave a Comment