38.2 C
Hyderabad
May 5, 2024 19: 58 PM
Slider ఖమ్మం

ఓటు పట్ల అవగాహన అవసరం

#DRDO Madhusudan

ఎన్నికలు, ఓటు హక్కు పట్ల అవగాహనకు ఎలక్ట్రోరల్ లిట్రసి క్లబ్స్ ఏర్పాటు చేసినట్లు స్వీప్ నోడల్ అధికారి, డిఆర్డీఓ మధుసూదన్ రాజు తెలిపారు. ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హలులో ఎలక్ట్రో లిటరసీ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జిల్లాలో 100 ఉన్నత పాఠశాలలో 70 కళాశాలలో ఎలక్ట్రో లిటరసీ క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధి విధానాలు, నూతన మరియు భవిష్యత్తు ఓటర్లు ఓటు హక్కు ప్రాధాన్యత తెలుసుకోవడానికి ఈ క్లబ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.

ప్రజాస్వామ్య పునాదికై ఓటర్లకు అవగాహన ముఖ్యమని వారి పాత్రను మరింత విస్తృతపరచడానికి ఎన్నికలు సజావుగా జరగడానికి ఈ ఎల్ సి లు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రత్యక్ష అనుభవం ద్వారా ఓటర్ నమోదు ఎన్నికల సంబంధిత విషయాల గురించి టార్గెట్ గ్రూపులను విద్యావంతులను చేయడం ఈవీఎం మరియు వివి పాట్ విశ్వసనీయత పటిష్టత సమగ్రత గురించిన అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు.

ఓటు విలువ గురించి ఓటు వేసే హక్కును ఆత్మవిశ్వాసంతో సౌకర్యవంతంగా నీతివంతమైన పద్ధతిలో వినియోగించుకోవడంలో విలువను అర్థం చేసుకోవడంలో తోడ్పడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండగానే ఓటర్లుగా నమోదు చేసుకునేట్లు చేయడం ప్రతి ఓటు ముఖ్యమే నని, ఏ ఓటరు ఓటు వేయకుండా ఉండకూడదు అన్న సూత్రాన్ని అనుసరించి సంస్కృతిని పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు అవగాహన కల్పించాలని చెప్పారు.

ఎన్నికల మాస్టర్ ట్రైనర్స్ పూసపాటి సాయి కృష్ణ , కె కిరణ్ కుమార్ లు శిక్షణ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సమావేశంలో ఎలక్ట్రో లిటరసి క్లబ్ లు గా ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్దార్ పటేల్ విగ్రహానికి పాలాభిషేకం

Satyam NEWS

వరంగల్ లో అంతర్జాతీయ అంధుల దినోత్సవం

Satyam NEWS

సీపీఎస్ ఇచ్చిన మాట తప్పారా…. పూర్తిగా మరిచారా …?

Satyam NEWS

Leave a Comment